ISL 2020-21: వరస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న ముంబైని కట్టడి చేసిన హైదరాబాద్ ఎఫ్‌సీ

ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 రసవత్తరంగా సాగుతోంది. రోజురోజుకు పాయింట్ల పట్టికలో లెక్కలు మారిపోతున్నాయి.  వరుసగా నాలుగు దుమ్మురేపుతోన్న ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌ జోరుకు...

ISL 2020-21: వరస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న ముంబైని కట్టడి చేసిన హైదరాబాద్ ఎఫ్‌సీ

Updated on: Jan 17, 2021 | 9:32 PM

ISL 2020-21:  ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 రసవత్తరంగా సాగుతోంది. రోజురోజుకు పాయింట్ల పట్టికలో లెక్కలు మారిపోతున్నాయి.  వరుసగా నాలుగు దుమ్మురేపుతోన్న ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌ జోరుకు హైదరాబాద్ బ్రేక్ వేసింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 0-0తో ముంబైని అడ్డుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో అదిరిపోయే విజయాలు అందుకున్న హైదరాబాద్.. ఫుల్ స్వింగ్‌లో ఉన్న ముంబైని అడ్డుకోవడంలో సఫలీకృతం అయ్యింది.  ముంబై గోల్ ప్రయత్నాలను గోల్ కీపర్ లక్ష్మీకాంత్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. డిఫెండర్ ఆకాశ్ మిశ్రా కూడా మంచి ప్రదర్శన చేశాడు. హైదరాబాద్ కూడా గోల్ చేసేందుకు మంచి ప్రయత్నాలు చేసినా.. ముంబై డిఫెన్స్ పటిష్టంగా ఉండటంతో వర్కువుట్ అవ్వలేదు.

మొత్తం మీద 11 మ్యాచ్‌ల్లో 8 గెలుపులు 2 డ్రాలు, ఒక ఓటమితో ముంబై 26 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇక 11 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ 4 విజయాలు, 4 డ్రాలు, మూడు ఓటములతో 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

Also Read:  IRFC IPO : ఐపీఓలోకి తొలిసారి ప్రభుత్వ రంగ సంస్థ ఎంట్రీ .. ఒక్కో షేరు ధర రూ.25 ఉండే ఛాన్స్

Loading...
Unable to load recommendations.
Follow Us