ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 సీజన్‌లో ఏటీకే మోహన బగాన్ ఫుట్ క్లబ్ అదరగొడుతోంది. తాజాగా కోల్‌కతాకే చెందిన ఈస్ట్ బెంగాల్‌కు ఏటీకే..ఝలక్ ఇచ్చింది. వరుసగా రెండో విజయాన్ని ఒడిసిపట్టి టేబుల్ టాపర్‌గా సత్తా చాటింది. తిలక్ గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన పోరులో ఏటీకే మోహన్ బగాన్ 2-0తో బెంగాల్‌ను చిత్తు చేసింది. రాయ్ కృష్ణ(49వ నిమిషం), మన్వీర్ సింగ్(85వ నిమిషం)లో గోల్స్ చేసి ఏటీకేకు సూపర్ విక్టరీని అందించారు. ఇది ఆ టీమ్ రెండో విజయం కాగా.. తొలి మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించింది. కాగా ఆసియాలోనే ఈ కోల్‌కతా టీమ్స్ మధ్య ఫైట్‌పై వేరే రేంజ్‌లో ఆసక్తి కనబరుస్తారు.
దాంతో రెండు జట్లు మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా భావించాయి. మైదానంలో ఇరు జట్లు రక్షణాత్మక ధోరణిలో ఆడటంతో ఫస్ట్ హాఫ్‌లో గోల్స్ నమోదు కాలేదు. విజయం కోసం గట్టిగా ప్రయత్నించిన టీమ్స్ గోల్స్ చేసే అవకాశాలను చివర్లో మిస్ చేసుకున్నాయి. అయితే సెకండ్ హాఫ్‌లో జోరు పెంచిన మోహన్ బగాన్ అదరగొట్టింది. మ్యాచ్ ఆరంభం నుంచి మంచి రైజ్‌లో ఉన్న ఫార్వర్డ్ రాయ్ కృష్ణ సెకండాఫ్ ఆరంభంలోనే గోల్‌తో శుభారంభం చేశాడు. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఆ టీమ్ ప్రత్యర్థి దాడులను సమర్థవంతంగా ఎదుర్కుంది. పదే పదే ప్రత్యర్థిపై ఆధిపథ్యం ప్రదర్శించింది. ఇక ఆట ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్న క్రమంలో మన్వీర్ సింగ్ గోల్ చేయడంతో ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది.
ALso Read :
మార్కెట్ పెంచుకునే పనిలో సూపర్ స్టార్ మహేశ్, తమిళ, కన్నడ ఇండస్ట్రీలపై దండయాత్ర
లోకనాయకుడి కుమార్తెను నేనుందుకు తగ్గుతాను, భారీ రెమ్యూనరేషన్‌పై శృతి ఫోకస్