ISL 2020 21: హైదారాబాద్ ఆటగాళ్లు రెచ్చిపోతే ఇట్టా ఉంటది.. ఏకపక్ష విజయం..పాయింట్ల పట్టికలో…

|

Jan 05, 2021 | 2:20 PM

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) 202021 సీజన్ రసవత్తరంగా సాగుతోంది.  అంతేకాదు హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్ అదదిపోయే విక్టరీ కొట్టింది. వరుసగా మూడు ఓటములతో...

ISL 2020 21: హైదారాబాద్ ఆటగాళ్లు రెచ్చిపోతే ఇట్టా ఉంటది.. ఏకపక్ష విజయం..పాయింట్ల పట్టికలో...
Follow us on

ISL 2020 21: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) 202021 సీజన్ రసవత్తరంగా సాగుతోంది.  అంతేకాదు హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్ అదదిపోయే విక్టరీ కొట్టింది. వరుసగా మూడు ఓటములతో డీలా చెడ్డ ఫ్యాన్స్‌కు.. ఘజ విజయంతో జోష్ తీసుకొచ్చింది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ‌ 4-1 తేడాతో రెండుసార్లు చాంపియన్ అయిన చెన్నయిన్‌ ఎఫ్‌సీని చిత్తు చేసింది. మ్యాచ్ జరిగినంతసేపు హైదరాబాద్‌ ఆటగాళ్లు ఆధిపత్యం ప్రదర్శించారు.

ఫస్ట్ హాఫ్‌లో  రెండు జట్లు పందెం కోళ్లలా తలపడటంతో ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. బ్రేక్‌లో ఏ ఎనర్జీ డ్రింక్ తాగారో తెలియదు కానీ..హైదరాబాద్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ప్రత్యర్థి జట్టుకు ఎక్కడా ఛాన్స్ లేదు. జోయల్‌ చియానెస్‌ (50వ నిమిషంలో), హాలిచరణ్‌ నర్జారీ (53వ నిమిషంలో) గోల్‌ కొట్టడంతో జట్టు ఆధిక్యం 2-0కు చేరింది.  ఆ తర్వాత అనిరుధ్‌ థాపా (67వ నిమిషంలో) గోల్‌తో చెన్నయిన్‌ టఫ్ ఫైట్ ఇచ్చేలా కనిపించింది. కానీ విక్టర్‌ (74వ నిమిషంలో),  హాలిచరణ్‌ (79వ నిమిషంలో) గోల్స్ చేయడంతో హైదరాబాద్‌ ఏకపక్ష విజయం అందుకుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌‌కు ఇది మూడో విజయం. ఆడిన తొమ్మిది మ్యాచులలో మూడు డ్రాలు ఉండగా, మరో మూడు పరాజయాలు ఉన్నాయి. 12 పాయింట్లతో టేబుల్‌లో ఆరో స్థానంలో ఉంది.

Also Read :

Sam Jam Season Finale: వారిద్దరూ కలిస్తే సూపర్ హిట్టేగా.. ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘చైయ్-సామ్’ ప్రోమో

జంగారెడ్డిగూడెంలో హృదయ విదారక ఘటన.. తల్లి మృతదేహంతోనే ఐదు రోజులు జీవనం

భర్త స్నేహితుడితో సాన్నిహిత్యం..కట్టుకున్నవాడిని చంపించిన వైనం..గుత్తిలో దారుణం