ISL 2020-21 highlights: 10 మందితో ఆడినా పట్టు తప్పలేదు.. గోవా వరుస విక్టరీలకు ఈస్ట్ బెంగాల్ బ్రేక్
ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. రోజురోజుకు పరిణామాలు మారిపోతున్నాయి. తిరుగులేదు అనుకున్న జట్లు అనూహ్యంగా తోక ముడుస్తున్నాయి.
ISL 2020-21 highlights: ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. రోజురోజుకు పరిణామాలు మారిపోతున్నాయి. తిరుగులేదు అనుకున్న జట్లు అనూహ్యంగా తోక ముడుస్తున్నాయి. తాజాగా వరుస విజయాలతో మంచి జోరుమీదున్న ఎఫ్‌సీ గోవాని.. ఎస్సీ ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ నిలువరించింది. బుధవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో ఏడో సీజన్‌లో గోవా ఎఫ్‌సీ జట్టుకు రెండో డ్రా ఎదురైంది. సమిష్ఠి ఆటతో ఈస్ట్ బెంగాల్ ఆటగాళ్లు.. గోవాని గోల్స్ చేయకుండా సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఓ దశలో 10 మందితో ఆడినా.. సమయస్పూర్తి ప్రదర్శించారు.
మ్యాచ్ ఆరంభం నుంచి గోవా, ఈస్ట్ బెంగాల్ జట్లు గోల్ చేసేందుకు పందెం కోళ్లలా తలపడ్డాయి. గోవా ప్రయత్నాలను ఈస్ట్ బెంగాల్ నిలువరించింది. దీంతో ఫస్ట్ హాఫ్ గోల్ లేకుండానే ముగిసింది. ఇక సెకండ్ హాఫ్ స్టార్టయ్యాక ఈస్ట్ బెంగాల్ దూకుడుగా ఆడటం ప్రారంభించింది. అయితే 56వ నిమిషంలో డానియల్‌కు రిఫరీ రెడ్‌కార్డు చూపించడంతో.. మిగతా మ్యాచ్ అంతా బెంగాల్ పది మంది ప్లేయర్స్‌తోనే ఆడింది. అయినప్పటికీ ఆధిపత్యం చలాయించిన ఆ జట్టు మ్యాచ్‌లో ఫస్ట్ గోల్‌ను ఖాతాలో వేసుకుంది. బ్రైట్ (79వ నిమిషంలో) గోల్ కొట్టి ఈస్ట్ బెంగాల్ జట్టును లీడ్‌లోకి తీసుకెళ్లాడు. కానీ ఆ వెంటనే రెండు నిమిషాలకే గోవా ప్లేయర్ దేవేంద్ర (81వ నిమిషంలో) గోల్ చేసి స్కోరు ఈక్వల్ చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ కోసం విశ్వప్రయత్నం చేసినా.. ఫలితం దక్కలేదు. దీంతో మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. గురువారం రాత్రి కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ, ఒడిశా ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Also Read :
Bowenpally Kidnap Case: అఖిల ప్రియకు ఫిట్స్.. బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ.. పరారీలోనే భార్గవ్ రామ్