రేపు ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుదల..!

|

Aug 28, 2020 | 10:30 PM

ఐపీఎల్ 2020 పూర్తి షెడ్యూల్‌ను 24 గంటల్లోపు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు, బీసీసీఐ మధ్య చర్చలు ముగిశాయి.

రేపు ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుదల..!
Follow us on

IPL 2020: ఐపీఎల్ 2020 పూర్తి షెడ్యూల్‌ను 24 గంటల్లోపు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు, బీసీసీఐ మధ్య చర్చలు ముగిశాయి. నిర్దేశించిన స్టేడియాల మధ్య రాకపోకలు, నిబంధనల సడలింపులు, ఇతరత్రా విషయాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. (కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)

కాగా, ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరగనుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు యూఏఈ చేరుకోవడమే కాకుండా వారం రోజుల క్వారంటైన్ కూడా పూర్తి చేశాయి. అయితే అబుదాబీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. పూర్తి షెడ్యూల్‌పై కాస్త జాప్యం కలిగింది. అంతేకాకుండా దుబాయ్, షార్జాల నుంచి అబుదాబీ రావాలంటే అందరికీ నెగటివ్ రావాల్సి ఉంటుంది. సో వెంటవెంటనే మ్యాచులకు ఆటగాళ్లు ఇది కష్టతరం అవుతుంది. అందుకే బీసీసీఐ, ఈసీబీతో మంతనాలు జరిపింది. నిబంధనల్లో సడలింపులు ఉండేలా ప్రభుత్వంతో మాట్లాడతానని ఈసీబీ చీఫ్‌ షేక్‌ నహ్‌యన్‌ బీసీసీఐకి హామీ ఇచ్చారు.