మరికొద్ది గంటల్లో బెంగళూరుతో కోలకతా పోరు

|

Oct 12, 2020 | 4:09 PM

ఐపీఎల్‌ టీ-20 క్రికెట్‌ లీగ్‌ అనుకున్నదానికంటే ఎక్కువగానే ఆసక్తి రేపుతోంది.. చాలామట్టుకు మ్యాచ్‌లు కడదాక ఉత్కంఠత రేపుతుండటమే ఇందుకు కారణం! ఒకే ఒక్క ఓవర్‌ మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసిన సందర్భాలు కూడా ఈ సీజన్‌లో చూశాం! మరికొద్ది గంటల్లో షార్జాలో జరగబోతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్‌ మ్యాచ్‌లో కూడా ఇలాంగి ముగింపే ఉండే అవకాశాలున్నాయి.. రెండు జట్లు ఒకదానితో ఒకటి ఏ మాత్రం తీసిపోవు! రెండూ రెండే! ఇరు జట్లు చెరో […]

మరికొద్ది గంటల్లో బెంగళూరుతో కోలకతా పోరు
Follow us on

ఐపీఎల్‌ టీ-20 క్రికెట్‌ లీగ్‌ అనుకున్నదానికంటే ఎక్కువగానే ఆసక్తి రేపుతోంది.. చాలామట్టుకు మ్యాచ్‌లు కడదాక ఉత్కంఠత రేపుతుండటమే ఇందుకు కారణం! ఒకే ఒక్క ఓవర్‌ మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసిన సందర్భాలు కూడా ఈ సీజన్‌లో చూశాం! మరికొద్ది గంటల్లో షార్జాలో జరగబోతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్‌ మ్యాచ్‌లో కూడా ఇలాంగి ముగింపే ఉండే అవకాశాలున్నాయి.. రెండు జట్లు ఒకదానితో ఒకటి ఏ మాత్రం తీసిపోవు! రెండూ రెండే! ఇరు జట్లు చెరో ఆరు మ్యాచ్‌లు ఆడాయి.. నాలుగు విజయాలను సంపాదించాయి.. ప్లే ఆఫ్‌ రేసులో పోటీపడుతున్నాయి.. ఇప్పటివరకు ఐపీఎల్‌లో రెండు జట్లు 24 సార్లు తలపడ్డాయి.. ఇందులో మాజీ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రెండు మెట్లు ముందే ఉంది.. కోల్‌కతా 14 మ్యాచ్‌లలో గెలిస్తే, బెంగళూరు పది మ్యాచ్‌లలో విజయం సాధించింది.. చివరిసారిగా తలపడిన రెండు మ్యాచులలో చెరో జట్టు విజయాన్ని నమోదు చేసుకున్నాయి.. కోల్‌కతా టీమ్‌ విషయానికి వస్తే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందా జట్టు! సిక్సర్లతో కదం తొక్కుతాడనుకున్న రసెల్‌ ఫామ్‌ కోసం కష్టపడుతున్నాడు.. మిస్టరీ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ఇక్కట్లకు గురి చేసే నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై నిఘా ఉంది.. ఇప్పటికే బీసీసీఐ నజర్‌ పెట్టింది.. ఈసారి ఏ మాత్రం అనుమానం వచ్చినా నరైన్‌కు కష్టమే! అదే ఇప్పుడు కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌కు తలనొప్పులు తెస్తోంది.. బెంగళూరుతో జరిగే మ్యాచ్‌కు ఎలాంటి ప్రణాళికతో వెళ్లాలనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నాడు. రాహుల్‌ త్రిపాఠి, శుభ్‌మన్‌ గిల్‌, నితీశ్‌ రాణాలు చెప్పుకోదగ్గ స్కోర్లనే సాధిస్తున్నారు. ఇయాన్‌ మోర్గాన్‌ బ్యాటింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బౌలింగ్‌ కూడా స్ట్రాంగ్‌గానే ఉంది.. బెంగళూరు ఆటగాళ్లు స్వేచ్ఛగా షాట్లు కొట్టకుండా ఎలా నియంత్రిస్తారో చూడాలి. మరోవైపు బెంగళూరు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బ్యాట్‌ నుంచి అలవోకగా పరుగులు వస్తున్నాయి.. ఓపెనర్లు పడిక్కల్‌, ఫించ్‌లు శుభారంభాన్ని అందిస్తున్నారు.. డిలివియర్స్‌ ఉండనే ఉన్నాడు.. వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ దూబెలు బౌండరీలను బాదేస్తున్నారు.. మొత్తంగా సమఉజ్జీల మధ్య సమరం ఆసక్తికరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..

బెంగళూరు ఫైనల్‌ ఎలెవన్‌ ఇలా ఉండవచ్చు…
పడిక్కల్‌, ఫించ్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, శివం దూబె, గుర్కీరత్‌ సింగ్, క్రిస్‌ మోరిస్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఇసురు ఉదాన, నవదీప్‌ సైని, యుజ్వేంద్ర చాహల్‌.
కోల్‌కతా తుది జట్టు ఇలా ఉండవచ్చు…
శుభ్‌మన్‌గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌, దినేశ్‌ కార్తిక్‌(కెప్టెన్‌), రస్సెల్‌, నరైన్‌, కమిన్స్‌, కమలేశ్‌ నాగర్‌కోటి, ప్రసిద్ధ్‌ కృష్ణ, వరుణ్‌ చక్రవర్తి