లెక్క సరి చేశాడు.. ఫినిషర్ అనిపించుకున్నాడు..

ఆఖరి ఓవర్.. ఢిల్లీ విజయానికి 17 పరుగులు అవసరం.. మొదటి రెండు బంతుల్లో రెండు పరుగులు వచ్చాయి. మ్యాచ్ గెలుస్తామా.? లేదా.? అని

లెక్క సరి చేశాడు.. ఫినిషర్ అనిపించుకున్నాడు..
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 18, 2020 | 11:06 AM

ఆఖరి ఓవర్.. ఢిల్లీ విజయానికి 17 పరుగులు అవసరం.. మొదటి రెండు బంతుల్లో రెండు పరుగులు వచ్చాయి. మ్యాచ్ గెలుస్తామా.? లేదా.? అని ఒకవైపు నుంచి ఢిల్లీ డగౌట్‌లో ఆందోళన మొదలైంది. కానీ అక్షర్ పటేల్ చిన్న ధోనిలా మూడు సిక్సర్లు కొట్టి ఢిల్లీ క్యాపిటల్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. (IPL 2020)

దీనితో ఒక్కసారిగా అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 2016లో ధోనితో ఉన్న లెక్కను అతడు సరి చేశాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఐపీఎల్ 2016 సీజన్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ధోని 6 బంతుల్లో 23 పరుగులు చేసి పూణేను గెలిపించాడు. ఇక ఇప్పుడు అక్షర్ ఆ లెక్కను సరి చేస్తూ.. ధోని కెప్టెన్‌గా ఉన్న చెన్నైపై మూడు సిక్సర్లు కొట్టి తమ జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు.