IPL 2020: బయో బబుల్‌ను దాటిన చెన్నై ప్లేయర్.. స్పందించిన ఫ్రాంచైజీ.!

|

Oct 02, 2020 | 7:22 PM

చెన్నై బౌలర్ ఆసిఫ్ బయో బబుల్ నిబంధనలను అతిక్రమించాడని.. బయట వ్యక్తులను కలిశాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వానాధ్‌ స్పందించారు.

IPL 2020: బయో బబుల్‌ను దాటిన చెన్నై ప్లేయర్.. స్పందించిన ఫ్రాంచైజీ.!
Follow us on

ఒక్క కరోనా కేసు వచ్చినా మొత్తం ఐపీఎల్ చిక్కుల్లో పడుతుంది. ఇది సీజన్ ప్రారంభం ముందు అందరి మాట. అందుకే ఫ్రాంచైజీల దగ్గర నుంచి ప్లేయర్ల వరకు అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ బయో బబుల్ వాతావరణాన్ని దాటి రావట్లేదు. అయితే తాజాగా చెన్నై బౌలర్ ఆసిఫ్ బయో బబుల్ నిబంధనలను అతిక్రమించాడని.. బయట వ్యక్తులను కలిశాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వానాధ్‌ స్పందించారు. (IPL 2020)

‘ఆసిఫ్ బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించలేదు. తన గది తాళం చెవి పోవడం వల్ల హోటల్‌కు వెళ్లి.. జట్టుకు కేటాయించిన సిబ్బందిని మాత్రమే కలుసుకున్నాడు. బయటివారిని ఎవ్వరినీ కలవలేదు. ప్రతీ ఆటగాడికి నిబంధనల గురించి పూర్తిగా తెలుసు’ అని కాశీ విశ్వనాధ్‌ పేర్కొన్నాడు.

Also Read:

 IPL 2020 CSK Vs SRH Live Cricket Score: ధోని, వార్నర్‌లలో ఎవరిది పైచేయి.!

ఐపీఎల్‌లో ‘అతనొక్కడే’.. ధోని ఖాతాలో అరుదైన రికార్డు