తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగస్టు నుంచి వీడియో పాఠాలు..!

Inter lessons to commence in August on Digital platform: దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ దెబ్బకు ఎన్నో ఈవెంట్లు, పరీక్షలు రద్దయ్యాయి. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా పాఠాలు బోధించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఆగస్టు రెండు లేదా మూడో వారం నుంచి డిజిటల్ పాఠాలు ప్రారంభించాలని.. యూట్యూబ్, టీశాట్‌, యాదగిరి, మనటీవీ సహా ఇతర ఛానెళ్ల […]

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగస్టు నుంచి వీడియో పాఠాలు..!

Edited By:

Updated on: Jul 16, 2020 | 12:13 PM

Inter lessons to commence in August on Digital platform: దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ దెబ్బకు ఎన్నో ఈవెంట్లు, పరీక్షలు రద్దయ్యాయి. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా పాఠాలు బోధించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఆగస్టు రెండు లేదా మూడో వారం నుంచి డిజిటల్ పాఠాలు ప్రారంభించాలని.. యూట్యూబ్, టీశాట్‌, యాదగిరి, మనటీవీ సహా ఇతర ఛానెళ్ల ద్వారా బోధన చేయాలని బోర్డు భావిస్తోంది.

అయితే.. జేఈఈ, నీట్, ఎంసెట్ పరీక్షల నేపథ్యంలో సిలబస్ కు కోతలు విధిస్తే కొత్త సమస్యలు ఎదురవుతాయని బోర్డు అధికారులు చెబుతున్నారు. డిజి‌టల్‌ పాఠా‌లను బోధించే విధా‌నంపై రెగ్యు‌లర్‌, కాంట్రాక్టు లెక్చ‌ర‌ర్లం‌ద‌రికీ శిక్షణ ఇస్తు‌న్నట్టు అధికారులు తెలిపారు. ఆగస్టు 10 వరకు ఈ శిక్షణ కొన‌సా‌గ‌ను‌న్నది. ప్రైవేటు కాలే‌జీల్లో పని‌చేసే లెక్చ‌ర‌ర్లకు కూడా డిజి‌టల్‌ బోధ‌నపై శిక్షణ ఇవ్వా‌లని బోర్డు అధి‌కా‌రులు కాలే‌జీల యాజ‌మా‌న్యా‌లకు చెప్తు‌న్నారు.