హైదరాబాద్‌లో ఉప రాష్ట్రపతి దీపావళి వేడుకలు

|

Nov 14, 2020 | 10:02 PM

ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీపం వెలుగులతో చీకటి మాయమైనట్లే.. దీపావళి కాంతులతో అందరి జీవితాల్లో మంచి మార్పు రావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు...

హైదరాబాద్‌లో ఉప రాష్ట్రపతి దీపావళి వేడుకలు
Follow us on

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీపావళి వేడుకలను హైదరాబాద్‌లో  జరుపుకొన్నారు. హైదరాబాద్‌లో నగరంలోని ఆయన కుమారుడి నివాసంలో దీపాలు వెలిగించారు. తన సతీమణి ఉషానాయుడుతో కలిసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీపాలు వెలిగించి వేడుకలు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీపం వెలుగులతో చీకటి మాయమైనట్లే.. దీపావళి కాంతులతో అందరి జీవితాల్లో మంచి మార్పు రావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

చెడుపై మంచి సాధించిన విజయంగా జరుపుకొనే ఈ దీపావళి స్ఫూర్తితో అందరం ఆత్మస్థైర్యాన్ని పొంది.. ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణం దిశగా కంకణబద్ధులమవుదామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్టుగా ఈసారి దీపావళి సందర్భంగా జవాన్ల త్యాగాన్ని గౌరవిస్తూ.. వారి కోసం ఒక దీపాన్ని వెలిగించి వారికి సంఘీభావాన్ని తెలియజేద్దామని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.