పెరుగుతున్న కరోనా కేసులు.. తగ్గుతున్న డిమాండ్..

| Edited By:

Jul 17, 2020 | 9:25 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తిరిగి లాక్‌డౌన్ విధించడం, పెరుగుతున్న ధరల కారణంగా ఈ నెల మొదటి అర్ధభాగంలో

పెరుగుతున్న కరోనా కేసులు.. తగ్గుతున్న డిమాండ్..
Follow us on

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తిరిగి లాక్‌డౌన్ విధించడం, పెరుగుతున్న ధరల కారణంగా ఈ నెల మొదటి అర్ధభాగంలో పెట్రోలు, డీజిల్‌కు డిమాండ్ బాగా పడిపోయింది. గత నెలతో పోలిస్తే కూడా బాగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

క్రూడ్ ఆయిల్ వినియోగంలో భారత్‌ది ప్రపంచంలోనే మూడో స్థానం కాగా, లాక్‌డౌన్ అమల్లో ఉన్న ఏప్రిల్‌లో పెట్రో అమ్మకాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. జులై మొదటి అర్ధ భాగంలో డీజిల్ అమ్మకాలు 18 శాతానికి పడిపోయి 2.2 మిలియన్ టన్నుల మాత్రమే అమ్మకాలు జరిగాయి. జూన్‌లో ఇదే సమయంలో దాదాపు 21 శాతం డీజిల్ విక్రయాలు జరిగినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గణాంకాలు చెబుతున్నాయి.

Also Read: యూజీసీ మార్గదర్శకాల మేరకు.. పరీక్షల నిర్వహణకే మొగ్గు..

Also Read: ఇక ప్రీ స్కూల్స్ గా అంగన్‌వాడీలు.. ఆన్‌లైన్‌లో బోధన..