‘భారతీయ మహిళలు.. అత్యంత అందవిహీనులు’: అమెరికా మాజీ అధ్యక్షుడు

అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ భారతీయ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు పలు ఆడియో టేప్స్ వెలుగులోకి వచ్చాయి. ''భారతీయ మహిళలు..

భారతీయ మహిళలు.. అత్యంత అందవిహీనులు: అమెరికా మాజీ అధ్యక్షుడు

Updated on: Sep 05, 2020 | 1:08 PM

Indian women sexless, unattractive: అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ భారతీయ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు పలు ఆడియో టేప్స్ వెలుగులోకి వచ్చాయి. ”భారతీయ మహిళలు.. ప్రపంచంలోనే అత్యంత అందవిహీనులు.. సెక్స్‌లెస్, ఆకర్షణ లేనివారు, ఎలా పునరుత్పత్తి చేస్తారో తెలియదు” అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తాజాగా యూఎస్ ప్రొఫెసర్ గ్యారీ జె. బాస్ ది న్యూయార్క్ టైమ్స్‌‌కు ఇచ్చిన ఓపీనియన్ పోల్‌లో వెల్లడించారు. అమెరికాకు 37వ అధ్యక్షుడిగా నిక్సన్ 1969-1974 వరకు పని చేశారు. ఇక ఆయనకు సంబంధించిన టేప్స్‌ను రిచర్డ్ నిక్సన్ లైబ్రరీ అండ్ మ్యూజియం విడుదల చేసింది. 

ఈ టేప్స్‌ను బాస్ తన పుస్తకం ‘ది బ్లడ్ టెలిగ్రామ్’లో ప్రస్తావించారు. ”నిక్సన్ భారతీయ మహిళలను నల్లజాతి మహిళలతో పోల్చారు. “నా ఉద్దేశ్యం ఏమిటంటే, బ్లాక్ ఆఫ్రికన్లలో కొద్దిగా ఆకర్షణ ఉంటుంది. కానీ భారతీయ మహిళలు చూడటానికి అందవిహీనులుగా ఉంటారు” అని నిక్సన్ పేర్కొన్నారు. అంతేకాకుండా నిక్సన్ నవంబర్ 4, 1971న అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీతో మాట్లాడుతున్నప్పుడు ” నాకైతే వారు అసలు నచ్చరు. మిగిలిన వ్యక్తులకు వారు ఎలా నచ్చుతున్నారో తెలియట్లేదు” అని చెప్పినట్లు విన్నానని బాస్ స్పష్టం చేశారు.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..

Loading...
Unable to load recommendations.
Follow Us