కరోనాకు 4 ఔషధాలు.. భారత సంతతి వైద్యుడి ఘనత..

| Edited By:

May 05, 2020 | 7:18 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు వివిధ దేశాల్లో పరిశోధనలు చివరి దశకు చేరుకొన్నాయి. మరో నాలుగైదు నెలల్లో వ్యాక్సిన్‌ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు చైనా, అమెరికా సహా భారత్‌లోని పలు పరిశోధనా సంస్థలు విశేషంగా కృషిచేస్తున్నాయి. వివరాల్లోకెళితే.. కరోనా వైరస్‌పై పోరాడే రెమ్‌డెసివిర్‌ సహా నాలుగు యాంటీ వైరల్‌ ఔషధాలను అమెరికాలో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన వైద్యుడు […]

కరోనాకు 4 ఔషధాలు.. భారత సంతతి వైద్యుడి ఘనత..
Follow us on

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు వివిధ దేశాల్లో పరిశోధనలు చివరి దశకు చేరుకొన్నాయి. మరో నాలుగైదు నెలల్లో వ్యాక్సిన్‌ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు చైనా, అమెరికా సహా భారత్‌లోని పలు పరిశోధనా సంస్థలు విశేషంగా కృషిచేస్తున్నాయి.

వివరాల్లోకెళితే.. కరోనా వైరస్‌పై పోరాడే రెమ్‌డెసివిర్‌ సహా నాలుగు యాంటీ వైరల్‌ ఔషధాలను అమెరికాలో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన వైద్యుడు గుర్తించారు. అమెరికాలోని మిస్పోరి విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ కమలేంద్రసింగ్‌, ఆయన సహచరులు కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డ్రగ్‌ డిజైన్‌ను ఉపయోగించి కొవిడ్‌-19 చికిత్సలో రెమ్‌డెసివిర్‌, 5-ఫ్లోరోరాసిల్‌, రిబావిరిన్‌, ఫావిపిరవిర్‌ మందుల ప్రభావాన్ని పరిశీలించారు.

కాగా.. కరోనా వైరస్‌ యొక్క ఆర్‌ఎన్‌ఏ ప్రోటీన్లను కరోనా వైరస్‌ యొక్క జన్యు కాపీలను తయారుచేయకుండా నిరోధించడంలో ఈ నాలుగు యాంటీ వైరల్‌ మందులు ప్రభావవంతంగా ఉన్నాయని పాథోజెన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో పేర్కొన్నారు. కొవిడ్‌-19 చికిత్సలకు సాధ్యమైనంత వరకు ఔషధాలను సూచించడమే మా లక్ష్యమని, అంటువ్యాధులతో బాధపడుతున్న రోగుల ఆరోగ్య ఫలితాలను మెరుగుపర్చడమే తమ పరిశోధనల ఉద్దేశమని ప్రొఫెసర్‌ కమలేంద్రసింగ్‌ తెలిపారు.