భారత రక్షణ దళం అమ్ముల పొదిలో శక్తివంతమైన మరో ఆయుధం వచ్చి చేరింది. సముద్రగర్భంలో ఉన్న శత్రుదేశాల సబ్ మెరైన్లను ముక్కులు ముక్కులుగా చేసే శక్తి కలిగిన యుధం ఇప్పుడు భారత నేవీలో చేరింది. గుట్టుగా సముద్ర మార్గంలో సరిహద్దులు దాటి దొంగ దెబ్బ తీసే శత్రువులను అంతమొందించే వజ్రాయుధం. 95 శాతం పూర్తి స్వదేశీ పరి జ్ఞానంతో తయారు చేశారు
సముద్రగర్భంలో ఉన్న శత్రుదేశ సబ్‌మెరైన్‌ని ధ్వంసం చేసే అత్యంత బరువున్న టార్పెడో వారుణాస్త్రని తయారు చేసిన భారత డైనమిక్స్ లిమిటెడ్ భారత నౌకాదళానికి అప్పగించింది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకి చెందిన ఎన్‌ఎస్‌టీఎల్ వారుణాస్త్రని డిజైన్ చేసింది. బీడీఎల్ దీన్ని తయారు చేసింది. విశాఖలోని బీడీఎల్‌ని సందర్శించిన డీఆర్‌డీవో చైర్మన్ డా.జి.సతీష్‌రెడ్డి చేతుల మీదుగా వారుణాస్త్రని నేవీకి అప్పగించారు.
ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి ఈ వారుణాస్త్రంకు సంబంధించిన వివరాలను అంధించారు. ఇటీవలే బీడీఎల్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ ప్రయోగం విజయవంతం అవడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌టీఎల్, బీడీఎల్ సంయుక్త సహకారంతో మొదటి వారుణాస్త్రని విజయవంతంగా తయారు చేసినందుకు వారికి అభినందనలు తెలిపారు.