దుబాయ్‌లో భారతీయ దంపతుల దారుణహత్య

దుబాయ్‌లో భారతీయ దంపతులు దారుణహత్యకు గురయ్యారు. డబ్బు, నగల కోసమే పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి ఈ హత్యకు పాల్పడట్టు స్థానిక పోలీసులు తెలిపారు.

దుబాయ్‌లో భారతీయ దంపతుల దారుణహత్య

Updated on: Jun 23, 2020 | 4:48 PM

దుబాయ్‌లో భారతీయ దంపతులు దారుణహత్యకు గురయ్యారు. డబ్బు, నగల కోసమే పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి ఈ హత్యకు పాల్పడట్టు స్థానిక పోలీసులు తెలిపారు.
భారత్‌కు చెందిన హిరెన్ అధియా, భార్య విధి అధియాతో కలిసి రెండేళ్లుగా దుబాయ్‌లోని అరేబియన్‌ రాంచెస్‌లో నివాసం ఉంటున్నాడు. జూన్‌ 18న హిరెన్‌ తన భార్య విధి అధియాతో కలిసి వ్యాపార నిమిత్తం యూఏఈకి వచ్చాడు. వారి వద్ద నగలు, నగదును గమనించిన పాకిస్తాన్‌ సంతతికి చెందిన వ్యక్తి దంపతులిద్దరిని హతమార్చి సొమ్మును దోచుకుని ఉడాయించాడు. స్థానికుల సమాచారం మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతని నుంచి నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. హిరెన్‌ దంపతుల హత్యకు సంబంధించి దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌లో సమాచారమివ్వడంతో ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Follow Us