బంగ్లాదేశ్ పట్ల భారత్ మరోసారి ఔదార్యం.. రెండు మిలియన్ డోసుల వ్యాక్సిన్ బహుమతి..

|

Jan 19, 2021 | 6:30 AM

బంగ్లాదేశ్ పట్ల భారత్ మరోసారి ఔదార్యం చూపించింది. భారతదేశం బంగ్లాదేశ్‌కు రెండు మిలియన్ డోసుల కొవిడ్-19 ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను బహుమతిగా పంపించింది.

బంగ్లాదేశ్ పట్ల భారత్ మరోసారి ఔదార్యం.. రెండు మిలియన్ డోసుల వ్యాక్సిన్ బహుమతి..
Follow us on

India Will Gift Bangladesh : బంగ్లాదేశ్ పట్ల భారత్ మరోసారి ఔదార్యం చూపించింది. భారతదేశం బంగ్లాదేశ్‌కు రెండు మిలియన్ డోసుల కొవిడ్-19 ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను బహుమతిగా పంపించింది. భారతదేశంలో సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన ఆక్స్ ఫర్డ్ అస్ట్రాజెనికా వ్యాక్సిన్ 2 మిలియన్ డోసులు ప్రత్యేక విమానంలో జనవరి 20వతేదీన షహజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుందని భారత రాయబారి బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రిత్వశాఖకు రాసిన లేఖలో తెలిపారు.

భారత్ బహుమతిగా ఇచ్చిన కరోనా టీకాలను నిల్వ చేసి బంగ్లాదేశ్ పౌరులకు వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బంగ్లాదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి జాహిద్ చెప్పారు. బంగ్లాదేశ్ బారత్ నుంచి 30 మిలియన్ డోసుల కోవిషీల్డు వ్యాక్సిన్ ను భారతదేశం నుంచి సేకరిస్తోంది. ఈ మేర బంగ్లాదేశ్- సీరం ఇన్‌స్టిట్యూట్‌ల మధ్య ఒప్పందం కుదిరింది.

ఇవి కూడా చదవండి :

సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ… ఏకగ్రీవంగా ఎన్నుకున్న ట్రస్టీ సభ్యులు

దశాబ్ధాలు కాదు.. శతాబ్ధం.. ఏకంగా 110 ఏళ్లనాటి రికార్డులకు బ్రేక్.. శార్దూల్‌, సుందర్‌ జోడీ అదుర్స్ ..