
India Vs Australia 2020: అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత బంతులతో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. తొలి ఓవర్‌లోనే స్టీవ్ స్మిత్(1)ను పెవిలియన్ చేర్చిన అతడు.. తర్వాత ట్రావిస్ హెడ్(7), కెమెరాన్ గ్రీన్(11) వికెట్లను పడగొట్టి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. దీనితో ఆస్ట్రేలియా 79 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో ఆసీస్ యువ బ్యాట్స్‌మెన్ లబూషేన్(47), కెప్టెన్ పైన్(26) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. కాసేపు వీరిద్దరూ కలిసి భారత్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. అయితే లబూషేన్.. ఆ తర్వాత కమ్మిన్స్ వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో.. ఆస్ట్రేలియా 111 పరుగుల వద్ద ఏడు వికెట్‌ను కోల్పోయింది. దీనితో 54 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ 111/7 పరుగులు చేసింది. భారత్ కంటే ఇంకా 133 పరుగుల వెనుకంజలో ఉంది.
కాగా, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 244 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారా 43 పరుగులు చేయగా, కోహ్లీ 74 పరుగుల చేసి కెప్టెన్‌గా తన విధిని నిర్వర్తించాడు. మయాంక్ అగర్వాల్ 17, అజింక్య రహాన 42, హనుమ విహారి 16 చొప్పున పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు పడగొట్టగా, కమిన్స్ 3, నాథన్ లయన్, హాజిల్ వుడ చెరో వికెట్ పడగొట్టారు.
Also Read:
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి ఉచిత బస్సు పాసులు..
‘చాయ్’ ప్రియులకు అలెర్ట్.. పేపర్ కప్పుల్లో తాగుతున్నారా.! ఆరోగ్యానికి ఇబ్బందేనంటున్న పరిశోధకులు..
‘మాస్టర్’ తెలుగు టీజర్ వచ్చేసింది.. విజయ్ స్క్వేర్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్‌కు పండగే..