బాక్సింగ్ డే టెస్టు: పెవిలియన్ బాటపట్టిన రహానే, జడేజా.. పట్టు బిగిస్తోన్న ఆసీస్ బౌలర్లు..
India Vs Australia 2020: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే 112 పరుగుల వ్యక్తిగత...

India Vs Australia 2020: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే 112 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్‌గా పెవిలియన్ బాటపట్టాడు. అలాగే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(57) కూడా అర్ధ సెంచరీ చేసి కుదురుకునే సమయానికి స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
277/5 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఆదిలోనే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. 99.5 ఓవర్‌లో నాథన్ లియోన్ వేసిన బంతికి రన్ తీయబోయి రహానే అవుట్ కాగా.. 106.5 ఓవర్‌లో స్టార్క్ బౌలింగ్‌లో జడేజా క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటికే 126 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్.. భారీ స్కోర్ చేసే దిశగా సాగుతోంది. ప్రస్తుతం 112 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్(12), ఉమేష్ యాదవ్(7) ఉన్నారు.
Rahane has been RUN OUT!
His excellent hundred comes to an end after Labuschagne’s quality throw #AUSvIND pic.twitter.com/6Ke1SWI2xm
— cricket.com.au (@cricketcomau) December 28, 2020
The plan works! Mitch Starc was pumped after Pat Cummins completed the juggled catch! #OhWhatAFeeling @Toyota_Aus | #AUSvIND pic.twitter.com/pmnF2CpvxJ
— cricket.com.au (@cricketcomau) December 28, 2020




