భారత్, ఆస్ట్రేలియా ఆఖరి టీ20 మ్యాచ్.. చెలరేగిన వేడ్, మాక్స్‌వెల్.. టీమిండియా టార్గెట్ 187..

|

Dec 08, 2020 | 3:47 PM

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఆఖరి టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా..

భారత్, ఆస్ట్రేలియా ఆఖరి టీ20 మ్యాచ్.. చెలరేగిన వేడ్, మాక్స్‌వెల్.. టీమిండియా టార్గెట్ 187..
Follow us on

India Vs Australia 2020: టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఆఖరి టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఆతిధ్య ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ మాథ్యూ వేడ్(80) అదరగొట్టడంతో ఆసీస్ 20 ఓవర్లకు 186/5 భారీ స్కోర్ సాధించగలిగింది. ఇన్నింగ్స్ మొదట్లో ఫించ్(0).. కొద్దిసేపటికే స్మిత్(24) వికెట్లు కోల్పోయినప్పటికీ.. వేడ్, మాక్స్‌వెల్(54)‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మిడిల్ ఓవర్లలో సిక్స్‌లు, ఫోర్ల‌తో నెట్ ఓవర్‌కు 10 పరుగులు దాటి రాబట్టారు. అటు భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా.. నటరాజన్, శార్దూల్ ఠాకూర్‌లు చెరో వికెట్ పడగొట్టారు.