India Vs Australia 2020: టీమిండియా యువ కెరటం తంగరాసు నటరాజన్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో అరంగేట్రం చేసిన నటరాజన్.. 44 రోజుల్లోనే మొత్తం 3 ఫార్మాట్లలో డెబ్యూ చేసిన భారత్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఒకే సిరీస్‌లో టీ20, వన్డేలు, టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇక ప్రస్తుతం జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో మొత్తం ఐదుగురు ప్లేయర్స్ టీమిండియా తరపున తుది జట్టులోకి వచ్చారు. సిరాజ్, సైని, గిల్, నటరాజన్, సుందర్ టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేశారు. కాగా, ఓ లెఫ్టార్మ్ సీమర్ చివరిసారిగా భారత్ తరపున 2010-11 సీజన్ దక్షిణాఫ్రికా సిరీస్ అప్పుడు డెబ్యూ అయ్యాడు. జయదేవ్ ఉనద్కట్ అరంగేట్రం చేశాడు.