India vs Australia 2020 : టీ20 సిరీస్ మనదే.. ఆస్ట్రేలియాపై రెండో టీ20లో భారత్ ఘనవిజయం.. టీమిండియాకిది వరుసగా పదో విక్టరీ

|

Dec 06, 2020 | 5:37 PM

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్‌ జట్టు అద్భుత‌ ప్రదర్శన చేసింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన సాధించింది.

India vs Australia 2020 : టీ20 సిరీస్ మనదే.. ఆస్ట్రేలియాపై రెండో టీ20లో భారత్ ఘనవిజయం.. టీమిండియాకిది వరుసగా పదో విక్టరీ

India vs Australia 2020 : టీమిండియా అద్భుతమైన పోరాటం ఫలించింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్‌ జట్టు అద్భుత‌ ప్రదర్శన చేసింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే భారత్‌ 2-0తో కైవసం చేసుకున్నది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కేవలం 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు. 3ఫోర్లు, 2సిక్సర్లతో వీరవిహారం చేయడంతో టీమిండియా 2 బంతులు మిగిలుండగానే టార్గెట్‌ను ఛేదించింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Dec 2020 05:26 PM (IST)

    టీ20 సిరీస్ భారత్ కైవసం.. రెండో మ్యాచ్ కూడా మనదే..

    195 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా… ‌ నాలుగు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలోనే ఛేదించింది. డేనియల్‌ సామ్స్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు సాధించి హార్దిక్‌ (42) జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో కోహ్లీ సేన మరో మ్యాచ్‌ మిగిలుండగానే టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.‌

  • 06 Dec 2020 05:13 PM (IST)

    చివరి ఓవర్లో 14 పరుగులు కావాలి

    చివరి ఓవర్‌కు మ్యాచ్ చేరుకుంది. 14 పరుగులు అవసరం ఉంది. క్రీజ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్ పాండ్య ఉన్నారు.

  • 06 Dec 2020 05:11 PM (IST)

    రెండు ఓవర్లు.. 25 పరుగులు… దూకుడు పెంచిన హార్దిక్ పాండ్య, శ్రేయస్‌ అయ్యర్‌

     

  • 06 Dec 2020 05:06 PM (IST)

    శ్రేయస్‌ అయ్యర్‌ సిక్సర్

     

  • 06 Dec 2020 05:04 PM (IST)

    విరాట్ కోహ్లీ ఔట్

    విరాట్ కోహ్లీ : డేనియల్‌ సామ్స్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన కోహ్లీ..వికెట్‌కీపర్‌ వేడ్ చేతికి చిక్కాడు

  • 06 Dec 2020 04:55 PM (IST)

    15 ఓవర్లో 141-3..

    15 ఓవర్లో 141-3 : ఈ ఓవర్లో కోహ్లీ రెండు ఫోర్లు, సిక్స్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.

  • 06 Dec 2020 04:52 PM (IST)

    కోహ్లీ మరో సిక్సర్‌

    కోహ్లీ దూకుడు పెంచాడు. 14.4లో ఆండ్రూ టై వేసిన బంతిని భారీ సిక్సర్‌గా మార్చాడు

  • 06 Dec 2020 04:50 PM (IST)

    సంజు శాంసన్‌ ఔట్

     

    టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. స్వెప్సన్‌ బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించిన శాంసన్‌.. స్మిత్‌ చేతికి చిక్కాడు. క్రీజ్ లో హార్దిక్ పాండ్య వచ్చాడు.

  • 06 Dec 2020 04:45 PM (IST)

    కోహ్లీ సిక్సర్‌

    12 ఓవర్లకు భారత్‌ 105/2 : జంపా ఈ ఓవర్‌లో వికెట్ తీసి 11 పరుగులు ఇచ్చాడు. అయిదో బంతిని కోహ్లీ (19) ఎక్స్‌ట్రా కవర్‌ మీదగా సిక్సర్‌ బాదాడు.

  • 06 Dec 2020 04:41 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన భారత్… 52 పరుగులు సాధించి వెనుదిరిగిన ధావన్…

    భారత్ రెండో వికెట్‌ను కోల్పోయింది. జంపా వేసిన 12 ఓవర్లో మొదటి బంతికి శిఖర్ ధావన్ ఔట్ అయ్యాడు. శిఖర్ 36 బంతుల్లో 52 పరుగులు చేసి వెనుతిరిగాడు…

  • 06 Dec 2020 04:23 PM (IST)

    8 ఓవర్లకు టీమిండియా 73-1

    టీమిండియా బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడుతున్నారు. 8వ ఓవర్‌లో 73/1 పరుగులు చేసింది. ఈ ఓవర్లో 9 పరుగులు చేసింది. ధావన్‌ బౌండరీ చేశాడు. క్రీజులో ధావన్‌, విరాట్ కోహ్లీ ఉన్నారు. టీమిండియా 73-1.

  • 06 Dec 2020 04:18 PM (IST)

    కేఎల్ రాహుల్(30) ఔట్

    5.2 ఓవర్లకు భారత్‌ 56/1: టీమిండియా తొలి వికెట్‌ను‌ కోల్పోయింది. ఆండ్రూ టై వేసిన రెండో బంతిని భారీషాట్‌కు యత్నించిన రాహుల్‌.. స్వెప్సన్‌ చేతికి చిక్కాడు. క్రీజులోకి కోహ్లీ వచ్చాడు.

  • 06 Dec 2020 04:09 PM (IST)

    టీమిండియా ఓపెన్ల దూకుడు..

    టీమిండియా ఓపెన్లు ధావన్‌, కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడుతున్నారు.

  • 06 Dec 2020 04:05 PM (IST)

    4 ఓవర్లకు టీమిండియా 43-0 :

    నాలుగు ఓవర్ల వద్ద టీమిండియా ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. క్రీజులో ధావన్‌, కేఎల్ రాహుల్ ఉన్నారు.

  • 06 Dec 2020 04:02 PM (IST)

    ధావన్‌ సిక్సర్

     

  • 06 Dec 2020 03:47 PM (IST)

    తొలి ఓవర్లో..5/0

    భారీ టార్గెట్‌తో రంగంలోకి దిగింది టీమిండియా.. తొలి ఓవర్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేయగలిగింది టీమిండియా. క్రీజులో ధావన్‌, కేఎల్ రాహుల్ ఉన్నారు. టీమిండియా5/0.

  • 06 Dec 2020 03:24 PM (IST)

    భారత్‌ టార్గెట్ 195 పరుగులు

    20 ఓవర్లకు ఆసీస్‌ 194/5: దీపక్ చాహర్ వేసిన ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. అయిదో బంతిని (16) స్టాయినిస్ సిక్సర్‌‌గా మార్చాడు. డేనియల్ (8) నాటౌట్‌గా నిలిచాడు.

  • 06 Dec 2020 03:17 PM (IST)

    హెన్రిక్స్‌ (26) ఔట్..

    నటరాజన్‌ ఈ ఓవర్‌లో వికెట్‌ తీసి 8 పరుగులు ఇచ్చాడు. మూడో బంతికి హెన్రిక్స్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆఖరి బంతికి డేనియల్‌ (5) బౌండరీ బాదాడు. అతడికి తోడుగా స్టాయినిస్‌ (2) ఉన్నాడు

  • 06 Dec 2020 03:10 PM (IST)

    స్టీవ్‌ స్మిత్‌ 46(38) ఔట్

    18 ఓవర్లకు ఆసీస్‌ 169/4: చాహల్ బౌలింగ్‌లో భారీషాట్‌కు ప్రయత్నించిన స్మిత్‌… హార్దిక్‌ చేతికి దొరికిపోయాడు. కష్టతరమైన క్యాచ్‌ను హార్దిక్ అద్భుతంగా పట్టేశాడు. అంతకుముందు స్మిత్ సిక్సర్‌ బాదాడు. ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. క్రీజులో హెన్రిక్స్‌ (25), స్టాయినిస్ ఉన్నారు

  • 06 Dec 2020 03:04 PM (IST)

    17ఓవర్లకు 159/3

    ఆస్ట్రేలియా బౌండరీలు లేకుండానే ఈ ఓవర్లో ఏడు పరుగులు తీశారు. ప్రస్తుతం క్రీజులో స్టీవ్‌ స్మిత్‌,హెన్రిక్స్‌ ఉన్నారు.

  • 06 Dec 2020 03:00 PM (IST)

    15 ఓవర్లకు ఆస్ట్రేలియా 132/3

    ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ నిలకడగా ఆడుతున్నారు. నటరాజన్‌ వేసిన 15వ ఓవర్లో మొత్తం 5 పరుగులు వచ్చాయి. ఆస్ట్రేలియా ప్రస్తుతం 132/3

  • 06 Dec 2020 02:58 PM (IST)

    గ్లెన్‌ మాక్స్‌వెల్(22)‌ ఔట్..

    ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. ఠాకూర్ వేసిన 13వ ఓవర్లో మాక్స్‌వెల్(22)‌ బంతిని అక్కడే గాల్లోకి లేపి సుందర్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు. మరోవైపు 13ఓవర్లో స్మిత్‌ వరుసగా రెండు బౌండరీలు బాదడంతో మొత్తం 12 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో స్మిత్‌, హెన్రిక్స్‌ ఉన్నారు.

     

  • 06 Dec 2020 02:49 PM (IST)

    క్యాచ్ మిస్ చేసిన విరాట్ కోహ్లీ .. అయినా వేడ్(58)‌ రనౌట్

    ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన బౌలింగ్‌లో పరుగుకు ప్రయత్నించి వేడ్(58)‌ రనౌట్‌ అయ్యడు. క్రీజులో స్మిత్‌ , మాక్స్‌వెల్‌ ఉన్నారు. 8 ఓవర్లో మొత్తం 7 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 75/2.

  • 06 Dec 2020 02:38 PM (IST)

    10 ఓవర్లో మాక్స్‌వెల్‌ లాంగ్‌ఆఫ్‌ మీదుగా సిక్సర్..

    పదో ఓవర్లో మాక్స్‌వెల్‌ లాంగ్‌ఆఫ్‌ మీదుగా సిక్సర్. చాహల్‌ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 91/2.

  • 06 Dec 2020 02:21 PM (IST)

    వేడ్‌కు లైఫ్.. హార్దిక్ క్యాచ్ మిస్..

    6 ఓవర్లకు ఆసీస్‌ 59/1 : వేడ్‌ (47)కు లైఫ్‌ దొరికింది. శార్దూల్‌ వేసిన రెండో బంతిని భారీ షాట్‌కు యత్నించగా.. కాస్త కష్టతరమైన క్యాచ్‌ను బౌండరీ లైన్‌లో ఉన్న హార్దిక్‌ అందుకోలేకపోయాడు. ఈ ఓవర్‌లో వేడ్ మూడు ఫోర్లు బాదడంతో 12 పరుగులు వచ్చాయి.

  • 06 Dec 2020 02:09 PM (IST)

    షార్ట్ ఔట్..

    4.3 ఓవర్లకు ఆసీస్ నటరాజన్ బౌలింగ్ లో షాట్ కు యత్నించి తొమ్మిది పరుగుల వద్ద వెనుదిరిగాడు.

  • 06 Dec 2020 02:01 PM (IST)

    టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియా..ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా మాథ్యూ వేడ్

    ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఆరోన్ ఫించ్ లేక‌పోవ‌డంతో ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. తొలి టీ20 ఆడిన మ‌నీష్ పాండే, మ‌హ్మ‌ద్ ష‌మి, ర‌వీంద్ర జ‌డేజా ఈ మ్యాచ్‌లో ఆడ‌టం లేదు. అటు ఆసీస్ టీమ్‌లో తొలి టీ20 ఆడిన ఫించ్‌, స్టార్క్ ఈ మ్యాచ్‌కు దూర‌మ‌య్యారు. టాప్ ఫామ్‌లో ఉన్న హేజిల్‌వుడ్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడ‌టం లేదు. ఈ ముగ్గురి స్థానంలో స్టాయినిస్‌, సామ్స్‌, ఆండ్రూ టై టీమ్‌లోకి వ‌చ్చారు.

    భారత్ జట్టు సభ్యులు : ధావన్‌, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), సంజు శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్ పాండ్య, సుందర్‌, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, చాహల్, శార్దూల్‌

    ఆస్ట్రేలియా జట్టు సభ్యులు : షార్ట్‌, స్టాయినిస్‌, స్టీవ్‌ స్మిత్‌, హెన్రిక్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మాథ్యూ వేడ్‌ (కెప్టెన్‌), డేనియల్ సామ్స్‌, అబాట్‌, ఆండ్రూ టై, స్వెప్సన్‌, జంపా

Follow us on