దేశంలో క‌రోనా వీర‌విహారం.. ఒక్కరోజే 442 మరణాలు

దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులతో పాటు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండ‌టంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.

దేశంలో క‌రోనా వీర‌విహారం.. ఒక్కరోజే 442 మరణాలు

Updated on: Jul 04, 2020 | 10:33 AM

దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులతో పాటు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండ‌టంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. గ‌డిచిన 24 గంటల్లో కొత్తగా 22 వేల 771 మందికి క‌రోనా వైరస్​ సోకింది. మరో 442 మంది కోవిడ్-19 కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివ‌రాలు వెల్ల‌డించింది. దేశవ్యాప్తంగా జూన్ 3 వరకు మొత్తం 95,40,132 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. శుక్రవారం ఒక్కరోజు 2,42,383 ప‌రీక్ష‌లు చేసినట్లు వివ‌రించింది.

దేశంలో మొత్తం కేసులు 6,48,315
ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433
వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227
మొత్తం క‌రోనాతో చ‌నిపోయిన‌వారి సంఖ్య 18,655

మహారాష్ట్రలో వైరస్​ విల‌య‌తాండవం చేస్తోంది. అక్క‌డ మొత్తం కేసుల సంఖ్య 1,92,990కి చేరింది. వీరిలో 8376 మంది వైరస్​ కార‌ణంగా ప్రాణాలు విడిచారు. తమిళనాడులో వైర‌స్ ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. అక్క‌డ మొత్తం కేసుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటి వరకు 1,02,721 మందికి వైరస్​ నిర్దార‌ణ కాగా.. మరణాలు 1,385కి చేరాయి.గుజరాత్​లో 1906 మంది కోవిడ్-19 వ‌ల‌న‌ చనిపోయారు. కేసులు 35 వేలకు చేరువయ్యాయి.