IND Vs NZ: కోహ్లీకి అసలు ఏమైంది.?

|

Feb 29, 2020 | 2:30 PM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండు టెస్టులో భారత్ ఆచితూచి ఆడుతోంది. మొదటి టెస్టులో విఫలమైన ఓపెనర్ పృథ్వీ షా అర్ధ సెంచరీతో అదరగొట్టగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(3) మాత్రం మరోసారి ప్లాప్ షా కనబరిచాడు...

IND Vs NZ: కోహ్లీకి అసలు ఏమైంది.?
Follow us on

IND Vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండు టెస్టులో భారత్ ఆచితూచి ఆడుతోంది. మొదటి టెస్టులో విఫలమైన ఓపెనర్ పృథ్వీ షా అర్ధ సెంచరీతో అదరగొట్టగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(3) మాత్రం మరోసారి ప్లాప్ షా కనబరిచాడు. అటు రహానే(7), మయాంక్ అగర్వాల్(7) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడం.. మిడిల్ ఆర్డర్‌లో పుజారా(54), విహారీ(55)లు తప్పితే ఎవరూ రాణించకపోవడంతో టీమిండియా కష్టాల్లో పడింది. అటు టాయిలెండర్లు పరుగులు రాబట్టడంతో 242 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో జమీసన్ 5 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు.

ఇదిలా ఉంటే కోహ్లీ వరుస ఇన్నింగ్స్‌లలో విఫలం కావడం టీమిండియాను కలవరపెడుతోంది. జట్టుకు మిడిల్ ఆర్డర్‌లో పరుగులు రాబట్టే అతడు ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోయాడు. కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా పేలవ ప్రదర్శన కనబరిచాడు. గత ఐదు ఇన్నింగ్స్‌లో అతడు కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండో టెస్టులో అనవసరంగా రివ్యూ‌ను కోరడంతో టీమిండియా కెప్టెన్‌పై ట్విట్టర్ వేదికగా నెటిజన్లు కౌంటర్లు వేశారు.

For More News: 

అక్కడ కరోనా ఉన్నట్లు రుజువైతే లక్ష ఇస్తారట.. ఎందుకంటే..

మరోసారి కోహ్లీసేన ఫ్లాప్ షో.. వైట్‌వాష్ తప్పదా.?

వంటలక్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ సినిమాతోనే ‘దీప’ వెండితెర ఎంట్రీ.!

కాషాయ పార్టీకి కరెన్సీ వెల్లువ.. రూ 742 కోట్లతో అందనంత ఎత్తున..

అలెర్ట్: మార్చిలో ఏకంగా 19 రోజులు బ్యాంకుల సేవలు బంద్…