అటు వరల్డ్ ఎలెవన్ జట్టులో సఫారీ జట్టు నుంచి డుప్లెసిస్, ఎంగిడిలు పాల్గొనుండగా.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెయిర్ స్టో, హేల్స్, రషీద్, వెస్టిండీస్ ప్లేయర్లు గేల్, పూరన్, కీరన్ పొలార్డ్, కొట్రెల్.. ఇక జింబాబ్వే, న్యూజిలాండ్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
కాగా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అయితే తమకు కోహ్లీ కావాలని పట్టుబట్టింది. మరి బీసీసీఐ దానికి అంగీకారం ఇస్తుందో.. కోహ్లీ ఆ ఒక్క మ్యాచ్ అయినా ఆడతాడో లేదో చూడాల్సిందే.
ఆసియా ఎలెవన్: విరాట్ కోహ్లీ(ఒక్క మ్యాచ్ మాత్రమే, కానీ స్పష్టత లేదు), లోకేశ్ రాహుల్(ఓన్లీ వన్ గేమ్, నో క్లారిటీ), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, ముష్ఫికుర్ రహీమ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, లసిత్ మలింగా, తిసార పెరీరా, రషీద్ ఖాన్, ముజీబుర్ రహీమ్, సందీప్ లామిచానే.
వరల్డ్ ఎలెవన్: డుప్లెసిస్(కెప్టెన్), హేల్స్, గేల్, పూరన్, బ్రెండన్ టేలర్, జానీ బెయిర్ స్టో, కీరన్ పొలార్డ్, రషీద్, కొట్రెల్, ఎంగిడి, టై, మెక్లినగాన్