యూపీలో కరోనా ఉధృతి

|

Aug 22, 2020 | 6:37 PM

దేశంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ కొత్త కేసులు వెలుగుచూస్తునే ఉన్నాయి. వేలల్లో నమోదైన కేసుల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరగడంతోపాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది....

యూపీలో కరోనా ఉధృతి
Follow us on

దేశంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ కొత్త కేసులు వెలుగుచూస్తునే ఉన్నాయి. వేలల్లో నమోదైన కేసుల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరగడంతోపాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కరళనృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటల్లోనే 70 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కొత్తగా 5,375 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

శనివారం మరో 4,638 పేషెంట్లు డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 48,294 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,867 పెరిగింది. రాష్ట్రంలో కేబినెట్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. అయితే పట్టణ ప్రాంతంలోనే  కేసులు అధికంగా నమోదవుతున్నాయని అక్కడి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. యూపీ ప్రభుత్వ కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ అవున్నవారి సంఖ్య కూాడా అధికంగానే ఉందని అక్కడి అధికారులు అంటున్నారు.