ఆరు నెలల తర్వాత ఖైదీ ములాఖత్‌కు అనుమతి

|

Oct 01, 2020 | 12:21 PM

కరోనా వ్యాప్తి వల్ల గత ఆరు నెలలుగా నిలిచిపోయిన ఖైదీల ములాఖత్ కు అక్టోబరు 1వ తేదీ నుంచి జైళ్ల శాఖ అధికారులు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

ఆరు నెలల తర్వాత ఖైదీ ములాఖత్‌కు అనుమతి
Follow us on

కరోనా మహమ్మారి దెబ్బకు అన్నిరంగాలు స్తంభించిపోయాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉండే వారితో పాటు జైళ్లల్లోని ఖైదీలు సైతం కరోనా బారినపడ్డారు. దీంతో జైళ్లలో నిలిచిన ఖైదీలను కలుసుకునే అవకాశాన్ని నిలిపివేశారు. తాజా కేంద్ర ఆన్ లాక్ ప్రక్రియ ప్రారంభించడంతో ములాఖత్‌లకు ఎట్టకేలకు ఢిల్లీ జైళ్లశాఖ అనుమతించింది. కరోనా వ్యాప్తి వల్ల గత ఆరు నెలలుగా నిలిచిపోయిన ఖైదీల ములాఖత్ కు అక్టోబరు 1వ తేదీ నుంచి జైళ్ల శాఖ అధికారులు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జైళ్లలో ఖైదీలకు కరోనా సోకుతుండటంతో మార్చి 23వ తేదీ నుంచి ఖైదీలను కుటుంబసభ్యులు కలవడంపై నిషేధించారు. అయితే, తమ కుటుంబసభ్యులను కలిసేందుకు తమను అనుమతించాలని కోరుతూ గత రెండు నెలలుగా పలువురు ఖైదీలు జైలు అధికారులకు లేఖలు రాశారు. దీంతో స్పందించిన ఢిల్లీ జైళ్ల శాఖ ఖైదీల మిలాఖత్ కు ఒకే చెప్పింది.

ఖైదీలను కలిసేందుకు వచ్చే కుటుంబసభ్యులు వారికోసం కొత్త బట్టలు తీసుకురావాలని జైలు అధికారులు సూచిస్తున్నారు. ఢిల్లీలోని మూడు జైళ్లలో 14వేల మంది ఖైదీలున్నారు. ఒక ఖైదీ నెలకు ఒకసారి వారి కుటుంబసభ్యుడిని కలిసేందుకు అనుమతిస్తారు. ఖైదీల ములాఖత్ కోసం వచ్చేవారు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జైలు వద్ద సందర్శకులకు థర్మల్ స్కాన్ నిర్వహించిన అనంతరం కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఇదిలావుంటే, ఢిల్లీలోని తిహార్, మండోలి, రోహిణి జైళ్లలో 83 మంది ఖైదీలు, 207 మంది జైలు ఉద్యోగులకు కరోనా సోకిందని జైళ్ల శాఖ తెలిపింది.