అల్పపీడన ద్రోణి ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాలు..

|

Jul 24, 2020 | 8:46 AM

తెలంగాణలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అల్పపీడన ద్రోణి ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాలు..
Follow us on

Heavy Rains In Telangana: తెలంగాణలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి ఇప్పటికే మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. నిన్న హైదరాబాద్, రాష్ట్రంలోని పలు చోట్ల ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కురిశాయి. అటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలోనే రానున్న 72 గంటల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

గత రెండు రోజుల్లో హైదరాబాద్‌లోని గాజులరామారాంలో అత్యధికంగా 74ఎంఎం వర్షపాతం నమోదు కాగా, పీర్జాదిగూడలో 56.8 ఎంఎం వర్షపాతం, వెస్ట్ మారేడ్‌పల్లిలో 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు రాష్ట్రంలోని ఆది‌లా‌బాద్‌, వికా‌రా‌బాద్, మెద‌క్, యాదాద్రి భువ‌న‌గిరి, జన‌గామ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షపాతం వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నెల రోజుల హోం క్వారంటైన్..

ఏపీలో కరోనా విజృంభణ.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..!