నేడు లయరాజు ‘ఇళయ రాజా’ బర్త్ డే!

| Edited By:

Jun 02, 2019 | 4:44 PM

ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు, సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని. చిత్రపరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకుడు ’ఇళయరాజా’. ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. 1943, జూన్ 2 లో తమిళ్ నాడు లోని తేని జిల్లా పన్నియపురంలో జన్మించాడు. ఆయన జన్మదిన సందర్భంగా తన జీవితంలో సాధించిన విజయాల్ని ఒక్కసారిగా గుర్తుచేసుకుందాం. స్వర […]

నేడు లయరాజు ఇళయ రాజా బర్త్ డే!
Follow us on

ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు, సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలను కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని. చిత్రపరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సంగీత దర్శకుడు ’ఇళయరాజా’. ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. 1943, జూన్ 2 లో తమిళ్ నాడు లోని తేని జిల్లా పన్నియపురంలో జన్మించాడు. ఆయన జన్మదిన సందర్భంగా తన జీవితంలో సాధించిన విజయాల్ని ఒక్కసారిగా గుర్తుచేసుకుందాం.

స్వర రాజు ఇళయరాజా… ఇటు శాస్త్రీయ సంగీతాన్ని, అటు పాశ్చాత్య సంగీతాన్ని మధించిన స్వరకర్త . మన సంగీతంలో కూడా పల్లెజనం పాడుకునే గీతాలు … అదే జానపద గీతాలు, కర్ణాటక సంగీతంలోని లయబద్ధమైన ధ్వని విన్యాసాలు, లలితంగా సాగే స్వర కల్పనలు… ఇలా రకరకాల స్వరాల దారులున్నాయి. ఆ దారుల్ని తన ప్రయోగశాలగా మార్చుకొని విశిష్టమైన బాణీల్ని అందించారు ఈ లయ రాజు ఇళయరాజా.

ఇళయరాజా ఒక సంగీత వారథి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ. కన్నడ, మరాఠీ భాషల్లో వెయ్యికి పైగా సినిమాలలో దాదాపు 5000కు పైగా పాటలకు బాణీలందించారు. ఎక్కువగా తమిళ సినిమాలు చేశాడు. ఆయన సంగీతంవల్లే చాలా సినిమాలు విజయాన్ని సాధించాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ లయ రాజు పాటలకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో, నేపథ్య సంగీతానికీ అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు.

శ్రీరామరాజ్యం, సాగర సంగమం, సీతకోక చిలుక, రుద్రవీణ, జెంటిల్ మేన్, కిల్లర్, అభినందన, ఘర్షణ, ఛాలెంజ్, వంటి ఎన్నో మరిచిపోలేని సినిమాలకు సంగీతాన్ని అందించిన ఇళయరాజా ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుందాం.