‘ నాడు గుజ్రాల్ సలహాను పీవీ నరసింహారావు పాటించి ఉంటే.. ‘

|

Dec 05, 2019 | 5:30 PM

1984 ప్రాంతంలో అప్పటి ప్రధాని ఐ.కె. గుజ్రాల్ సలహాను నాటి హోం మంత్రి పీవీ నరసింహారావు పాటించి ఉంటే సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన ఊచకోతను, అల్లర్లను నివారించి ఉండవచ్ఛునని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. 1984 లో నాటి ప్రధాని ఇందిరా గాంధీని సిక్కులైన ఆమె బాడీగార్డులే హతమార్చడంతో.. ఇందుకు ప్రతీకారంగా పంజాబ్ వంటి ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు, ఘర్షణల్లో దాదాపు 3 వేలమంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. కాగా-దివంగత మాజీ ప్రధాని గుజ్రాల్ శత […]

 నాడు గుజ్రాల్ సలహాను పీవీ నరసింహారావు పాటించి ఉంటే..
Follow us on

1984 ప్రాంతంలో అప్పటి ప్రధాని ఐ.కె. గుజ్రాల్ సలహాను నాటి హోం మంత్రి పీవీ నరసింహారావు పాటించి ఉంటే సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన ఊచకోతను, అల్లర్లను నివారించి ఉండవచ్ఛునని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. 1984 లో నాటి ప్రధాని ఇందిరా గాంధీని సిక్కులైన ఆమె బాడీగార్డులే హతమార్చడంతో.. ఇందుకు ప్రతీకారంగా పంజాబ్ వంటి ప్రాంతాల్లో జరిగిన అల్లర్లు, ఘర్షణల్లో దాదాపు 3 వేలమంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. కాగా-దివంగత మాజీ ప్రధాని గుజ్రాల్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మన్మోహన్ సింగ్.. నాడు ఆ ఘోర దుర్ఘటన జరుగుతున్నప్పుడు.. గుజ్రాల్ స్వయంగా అప్పటి హోం మంత్రి పీవీ నరసింహారావును కలిసి.. అల్లర్ల అణచివేతకు సైన్యాన్ని రప్పించడం మంచిదని సలహా ఇచ్చారని , దాన్ని పీవీ పాటించి ఉంటే.అల్లర్లను నివారించి ఉండేవారని అన్నారు. ఆ అల్లర్లకు ఆ తరువాత ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ క్షమాపణ చెప్పిన విషయం గమనార్హం. సిక్కులకే కాక, దేశమంతటికీ క్షమాపణ చెప్పడానికి తాను సందేహించబోనని మన్మోహన్ పేర్కొన్నారు. నాడు ఇందిరా గాంధీతో తనకున్న సాన్నిహిత్యాన్ని అయన గుర్తు చేసుకున్నారు. .