
లాక్ డౌన్ తో సర్ధుమణుతుందనకున్న కరోనావైరస్ మన దేశంలో మెల్లమెల్లగా విస్తరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్న మహమ్మారి కాటు భారతీయులు గురవుతున్నారు. 4వ విడత లాక్ డౌన్ మే 31 వరకూ పొడిగిస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,242 పాజిటివ్ కేసులు, 157 మరణాలు నమోదయ్యాయి.
దీంతో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
* గత 14 రోజుల్లో ఇత దేశాల నుంచి వచ్చన ప్రతి ఒక్కరికి కరోనా పరీక్ష నిర్వహించాలి.
* పాజిటివ్ కేసులకు సంబంధించిన కాంటాక్ట్ ఉన్నవారందరికీ వైద్య పరీక్షలు చేయాలి.
* కొవిడ్-19 చికిత్స అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వైద్య పరీక్షలు నిర్వహించాలి.
* తీవ్ర శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి పరీక్షలు.
* కొవిడ్-19 బాధితులకు అత్యంత సన్నితంగా ఉన్నవారికి 5,10 రోజులకి తప్పనిసరిగి పరీక్ష.
* హాట్ స్పాట్, కంటైన్ మెంట్ జోన్లలో తీవ్ర అస్వస్థతకు గురైనవారికి కరోనా పరీక్ష.
* అనారోగ్యం బారిన పడిన వలస కూలీలకు ఏడు రోజుల్లో గా పరీక్ష.
కరోనా పరీక్షలు నిర్వహించడంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదని హెచ్చరించింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.