ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈఓ చందా కొచార్ భర్త దీపక్ కొచార్ ను ఈడీ ఈనెల 19 వరకు కస్టడీలోకి తీసుకోనుంది. మనీలాండరింగ్ వ్యవహారాల కేసులను విచారించే ప్రత్యేక కోర్టు ఇందుకు ఈడీకి అనుమతినిచ్చింది. 2010 లో ఈ బ్యాంకు రుణాలు ,మంజూరు చేసిన అనంతరం మాట్రిక్స్ ఫెర్టిలైజర్స్ నుంచి రూ. 325 కోట్లను, వీడియోకాన్ గ్రూపు నుంచి రూ. 64 కోట్ల పెట్టుబడులను దీపక్ నేతృత్వంలోని నూపవర్ రేనివబుల్స్ అందుకుంది. ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని ఈడీ భావించింది. ఈ రుణాల మంజూరులో చందా కొఛార్ పాత్ర కూడా ఉందని ఈ సంస్థ అనుమానిస్తోంది.