టీడీపీ ఎమ్మెల్యే ఇంట తీవ్ర విషాదం

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ శాసనసభ్యుడు బెందాళం అశోక్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన తండ్రి ప్రకాష్ తుదిశ్వాస విడిచారు.

టీడీపీ ఎమ్మెల్యే ఇంట తీవ్ర విషాదం

Updated on: Sep 14, 2020 | 1:57 PM

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ శాసనసభ్యుడు బెందాళం అశోక్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన తండ్రి ప్రకాష్ తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ప్రకాష్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే అశోక్‌ను  ఫోన్‌లో పరామర్శించారు.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచి బెందాళం ప్రకాష్ పార్టీకి చేసిన సేవలు అభినందనీయమని చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read :

విషాదం : చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్

కొత్త తరహా మోసం, హైదరాబాదీలూ తస్మాత్ జాగ్రత్త !

Loading...
Unable to load recommendations.
Follow Us