ఏపీలో ఈ నెల 31 న తన ‘ లక్ష్మీస్ ఎన్ఠీఆర్ ‘ మూవీ విడుదల కానుందని ప్రకటించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నాడు. వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆయనకు ప్రత్యేకంగా ఈ మూవీని చూపిస్తానని వర్మ తెలిపాడు. లక్ష్మీస్ ఎన్ఠీఆర్ మూవీ చూసేందుకు ఏపీ ప్రజలు కుతూహలంగా ఉన్నారని వర్మ పేర్కొన్నాడు. ఈ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డితో బాటు రామ్ గోపాల్ వర్మ తిరుమల వచ్చాడు.