హైదరాబాద్ మహానగరంలో పలు ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. కరోనా నేపథ్యంలో కొంతకాలంగా నిలిపివేసిన డ్రంక్ అండ్ డ్రైవ్‌ను తిరిగి ప్రాంరంభించారు. అర్థరాత్రి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి బ్రీత్ ఎన్‌లైజర్ ద్వారా గుర్తిస్తున్నారు. వాహనాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో మందుబాబుల కిక్ దించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. శనివారం రాత్రి మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం డ్రంక్ అండ్ డ్రైవ్ తనికీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 71 మంది వాహనదారులు పోలీసులకు పట్టుబడ్డారు. 71మందిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా 17కార్లు, 52 బైక్‌లు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మద్యం తాగి పట్టుబడ్డ వాళ్లందరికి వాళ్ల కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.