ఔటర్‌రింగ్‌ రోడ్డులో అదనపు ఓవర్‌పాసులు

|

Sep 21, 2020 | 6:24 PM

భాగ్యనగర శివారు ప్రాంతాల్లో ఔటర్‌ రింగ్‌ రోడ్డును కనెక్టివిటీ పెరుగుతున్న రద్ధీ దృష్ట్యా ఔటర్ వద్ద మరో రెండు ఓవర్‌పాస్‌ ఫ్లైఓవర్లు త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు.

ఔటర్‌రింగ్‌ రోడ్డులో అదనపు ఓవర్‌పాసులు
Follow us on

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ కూడా అంతే వేగంగా సాగుతోంది. హైదరాబాద్ మహానగరానికి ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎంతగానో దోహదపడుతోంది. అలాగే, భాగ్యనగర శివారు ప్రాంతాల్లో ఔటర్‌ రింగ్‌ రోడ్డును కనెక్టివిటీ పెరుగుతున్న రద్ధీ దృష్ట్యా ఔటర్ వద్ద మరో రెండు ఓవర్‌పాస్‌ ఫ్లైఓవర్లు త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే గండిపేట నుంచి నార్సింగ్‌కు ఉన్న ఓవర్‌పాస్‌ మాదిరిగా మరో రెండింటిని ఐటీ కారిడార్‌కు అనుసంధానంగా నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో వట్టినాగులపల్లి నుంచి కోకాపేట వరకు హెచ్‌ఎండీఏ చేపడుతున్న లేఅవుట్‌కు అనుసంధానంగా ఓవర్‌పాస్‌ ఫ్లైఓవర్‌ను, ఐఎ్‌సబీ నుంచి ల్యాంకోహిల్స్‌ వరకు మరో ఓవర్‌ పాస్‌ను ఆరు లేన్లతో నిర్మించడానికి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేసింది. త్వరలోనే ప్రభుత్వ అనుమతితో రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఔటర్‌ రింగ్‌ రోడ్డును కనెక్టివిటీ చేసేలా 100 అడుగుల రోడ్లు ఉన్నాయి. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో రోడ్లకు అనుగుణంగా హెచ్‌ఎండీఏ ఆయా రోడ్లను అభివృద్ధి చేస్తోంది. నగరానికి పశ్చిమ వైపు శరవేగంగా అభివృద్ధి జరుగుతుండడంతో అదేస్థాయిలో హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న రోడ్లకు అనుగుణంగా నిర్మాణాలు చేపడుతోంది. ఐఎస్‌బీ నుంచి ల్యాంకోహిల్స్‌ వరకు మాస్టర్‌ప్లాన్‌లో 100 అడుగుల రోడ్డు ఉండగా, ప్రస్తుతం నిర్మాణం చేపట్టారు. మధ్యలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు వస్తుండడంతో అక్కడ ఓవర్‌పాస్‌ ఫ్లైఓవర్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో డీపీఆర్‌ రూపకల్పనకు అధికారులు చర్యలు చేపట్టారు. కొత్త ఓవర్‌పాసులతో ఐఎ్‌సబీ నుంచి ల్యాంకోహిల్స్‌, మణికొండకు మెరుగైన కనెక్టివిటీ రోడ్డు ఏర్పడనుంది. గచ్చిబౌలి నుంచి తిరిగి వచ్చే దూరం తగ్గనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.