హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ), హైదరాబాద్ జోనల్ యూనిట్ సిబ్బంది సంయుక్తంగా రైడ్ చేసి భారీగా గంజాయిని పట్టుకున్నారు. హైదరాబాద్ సమీప ప్రాంతంలో ఓ సరుకు రవాణా వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. వాహనం ఖాళీ ప్లాస్టిక్ ట్రేలను రవాణా చేస్తుంది. క్షుణ్ణంగా తనిఖీ చేయగా గంజాయితో కూడిన పలు బ్యాగులు వాహనంలో లభించాయి.
పట్టుబడ్డ 1050 కేజీల గంజాయి విలువ మార్కెట్‌లో రూ. 2.62 కోట్లుగా సమాచారం. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ర్టకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. కేసు తదుపరి దర్యాప్తును చేపట్టినట్లు అడిషనల్ డైరక్టర్ జనరల్ తెలిపారు.
Read More:
తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!