HYD Police Tweet: ఏది పడితే అది ఓపెన్‌ చేయకండి… వైరల్‌గా మారిన హైదరాబాద్‌ పోలీసుల ట్వీట్‌..

|

Jan 15, 2021 | 12:09 AM

HYD Police Tweet: రోజురోజుకీ సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు భౌతికంగా జరిగిన దోపీడీలు ఇప్పుడు నెట్టింట్లో మనకు తెలియకుండానే జరిగిపోతున్నాయి...

HYD Police Tweet: ఏది పడితే అది ఓపెన్‌ చేయకండి... వైరల్‌గా మారిన హైదరాబాద్‌ పోలీసుల ట్వీట్‌..
Follow us on

HYD Police Tweet: రోజురోజుకీ సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు భౌతికంగా జరిగిన దోపీడీలు ఇప్పుడు నెట్టింట్లో మనకు తెలియకుండానే జరిగిపోతున్నాయి. రకరకాల వెబ్‌ లింక్‌ల ద్వారా అకౌంట్లలోని మొత్తాన్ని కాజేస్తున్నారు.
అయితే పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని ప్రచారాలు చేస్తున్నా వినియోగదారులు మాత్రం మోసపోతూనే ఉన్నారు. ఆఫర్ల పేరుతో వచ్చే వెబ్‌ లింక్‌లను క్లిక్‌ చేస్తూ కొంప కొల్లేరు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇదే విషయాన్ని కాస్త వెరైటీగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు హైదరాబాద్ పోలీసులు. ట్విట్టర్‌ వేదికగా ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.

ఇంతకీ ఆ వీడియో ఏముందంటే..

ఓ కోతి ముసుగు కప్పి ఉన్న ఒక వస్తువు దగ్గరకు వెళుతుంది. అయితే ఆ ముసుగు కింద ఏముందన్న ఆసక్తి ఆ కోతిలో స్పష్టంగా కనిపిస్తుంది. అచ్చం ఏదైనా కొత్త లింక్‌ ఓపెన్‌ చేసేముందు మనలో కనిపించే ఆతృతలాగే. అయితే తీరా ఆ ముసుగు తీయగానే… అందులో ఓ పులి బొమ్మ కనిపిస్తుంది. దీంతో కోతికి గుండె జారినంత పనై.. అక్కడిని జంప్‌ అవుతుంది. ఇక ఈ వీడియోను షేర్‌ చేసిన హైదరాబాద్‌ పోలీసులు.. ‘అన్ని వెబ్ లింక్ లను ఓపెన్ చేయకండి.. అందులో కొన్ని ప్రమాదకారమైనవి ఉండొచ్చు..’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఏది ఏమైనా హైదరాబాద్‌ పోలీసుల ఆలోచన భలే ఉంది కదూ.

Also Read: Accident: రాజేంద్రనగర్‌లో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. జస్ట్ మిస్.. అదృష్టావశాత్తు ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి..