మీ స్నేహితులకు క్రిస్మస్ శుభాకాంక్షలను వైరటీగా చెప్పాలనుకుంటున్నారా ?.. ప్రత్యేక స్టిక్కర్స్‌ను ఇలా పంపండి..
క్రిస్మస్ పండుగ రోజున మీ స్నేహితులకు గుర్తుండిపోయేలా శుభాకాంక్షలను చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇలా ప్రత్యేక స్టిక్కర్స్‌ను పంపించి వాళ్ళను
క్రిస్మస్ పండుగ రోజున మీ స్నేహితులకు గుర్తుండిపోయేలా శుభాకాంక్షలను చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇలా ప్రత్యేక స్టిక్కర్స్‌ను పంపించి వాళ్ళను సర్ప్రైజ్ చేయండి. ప్రముఖ మేసెజింగ్ సంస్థ వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలే స్టిక్కర్ సెర్చ్ వంటి నూతన అప్డేట్లను తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే వాట్సప్ చాలా రకాల స్టిక్కర్ ప్యాక్‌లను అందిస్తుంది. ఏదైన స్పెషల్ డేస్‌కు సంబంధించిన స్టిక్కర్స్ కోసం ఇక నుంచి వేరే ప్రత్యేక యాప్‌లను డౌన్ లోడ్ చేయవలసిన అవసరం లేదు. క్రిస్మస్ పండగ సందర్బంగా మీ స్నేహితులకు గానీ, బంధువులకు అందమైన వెరైటీ స్టిక్కర్స్‌ను పంపడానికి కొన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని సులువైన ప్రత్యేక యాప్‌లకు సంబంధించిన వివరాలను మీకు తెలియజేయడానికి మీ ముందుకు తీసుకువస్తున్నాం. మీ సన్నిహితులకు క్రిస్మల్ లేదా నూతన సంవత్సర ప్రత్యేక స్టిక్కర్లను ఎలా పంపించాలో తెలుసుకోండి.
క్రిస్మస్ స్టిక్కర్స్ పంపడం.. ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లో వాట్సాప్ క్రిస్మస్ స్టిక్కర్స్ అని టైప్ చేయండి. ఆ తర్వాత మీకు ప్లే స్టోర్‌లో చాలా రకాల యాప్స్ కనిపిస్తాయి. అందులో మీకు నచ్చిన యాప్స్ లేదా క్రిస్మస్ స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్ (వాస్టిక్కర్ ఆప్), క్రిస్మస్ స్టిక్కర్ ప్యాక్ 2020 అనే యాప్‌లను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్స్ ఓపెన్ చేసాక ఇందులో చాలా రకాల క్రిస్మస్, న్యూ ఇయర్‍కు సంబంధించిన స్టిక్కర్లు కనిపిస్తాయి. ఇందులో మీకు నచ్చిన వాట్సాప్ స్టిక్కర్లను సెలక్ట్ చేసుకోని, మీరు స్టిక్కర్ విండోలో ఉన్న + బటన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇంకా స్టిక్కర్లు ఆడ్ చేయాలనుకుంటే ADD బటన్ పై క్లిక్ చేయండి. అంతే మీకు వాట్సాప్‌లో యాప్‌లో కొత్త క్రిస్మస్ స్టిక్కర్లు కనిపిస్తాయి. ఈ ప్రత్యేకమైన స్టిక్కర్లను ఎవరికైతే పంపిచాలని అనుకుంటున్నారో వారి చాట్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత టైపింగ్ బార్లో ఉన్న స్మైలీ ఐకాన్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన స్టిక్కర్లను సెలెక్ట్ చేసుకొని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసి ఈ క్రిస్మస్ పర్వదినాన్ని మరింత సంబంరంగా జరుపుకొండి.