“మా అమ్మ నుంచి నన్ను వేరు చేస్తారా”..పుట్టగానే శిశువు రియాక్షన్..

అప్పుడే పుట్టిన శిశువులు సహజంగా ఏడుస్తారు. అప్పటివరకు అమ్మ కడుపే ప్రపంచంగా బ్రతికిన పసికోనలు..ఈ మానవలోకాన్ని అర్థం చేసుకోవడానికి కూసింత టైమ్ పడుతోంది.

  • Ram Naramaneni
  • Publish Date - 5:23 pm, Mon, 24 February 20
"మా అమ్మ నుంచి నన్ను వేరు చేస్తారా"..పుట్టగానే శిశువు రియాక్షన్..

అప్పుడే పుట్టిన శిశువులు సహజంగా ఏడుస్తారు. అప్పటివరకు అమ్మ కడుపే ప్రపంచంగా బ్రతికిన పసికూనలు..ఈ మానవలోకాన్ని అర్థం చేసుకోవడానికి కూసింత టైమ్ పడుతోంది. ఫిబ్రవరి 13, గురువారం మధ్యాహ్నం బ్రెజిల్‌లోని రియో ​​డి జనీరోలోని ఆసుపత్రిలో ఓ శిశువు మాత్రం పుట్టుగానే అస్సలు ఏడవలేదు. “మా అమ్మ నుంచి నన్ను వేరు చేస్తారా” అన్నట్టు డాక్టర్లవైపు కోపంగా చూడటం మొదలెట్టింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ రోడ్రిగ్గో స్నాప్ తీయడంతో..అది కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన మహిళకు సిజేరియన్ చేసిన వైద్యులు..శిశువును బయటకు తీసి..బొడ్డు తాడు కట్ చేస్తుండగా..బుడ్డదాని  ముఖంలో హావభావాలు చూసి డాక్టర్లు షాక్ తిన్నారు. వైద్యులు ఏడిపించడానికి ప్రయత్నించినప్పటికి చిన్నారి..అందుకు ససేమేరా అంది. చివరికి తల్లి ముద్దు ఇచ్చాక చిన్న పాప ఏడవడం ప్రారంభించింది.