ఇంజనీరింగ్‌ ఫీజుల్లో స్వల్ప పెరుగుదల!

| Edited By: Pardhasaradhi Peri

Jun 29, 2019 | 4:38 PM

తెలంగాణలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఫీజులపై నెలకొన్న సందిగ్ధతకు తాత్కాలికంగా తెరపడింది. ఫీజులను తాత్కాలికంగా పెంచేందుకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) అవకాశం కల్పిస్తూ చేసిన ప్రతిపాదనను కళాశాలలు అంగీకరించాయి. శనివారం ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో జరిగిన భేటీలో ఫీజులను 15 నుంచి 20శాతం పెంచేందుకు ఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదించింది. ప్రస్తుతం రూ.50వేలు లోపు ఉన్న ఫీజులను 20శాతం పెంచేందుకు ఏఎఫ్‌ఆర్‌సీ అంగీకారం తెలిపింది. అలాగే, 50వేలకు మించి ఉన్న ఫీజులను 15శాతం పెంచేందుకు ప్రతిపాదించింది. నెల […]

ఇంజనీరింగ్‌ ఫీజుల్లో స్వల్ప పెరుగుదల!
Follow us on

తెలంగాణలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఫీజులపై నెలకొన్న సందిగ్ధతకు తాత్కాలికంగా తెరపడింది. ఫీజులను తాత్కాలికంగా పెంచేందుకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) అవకాశం కల్పిస్తూ చేసిన ప్రతిపాదనను కళాశాలలు అంగీకరించాయి. శనివారం ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో జరిగిన భేటీలో ఫీజులను 15 నుంచి 20శాతం పెంచేందుకు ఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదించింది. ప్రస్తుతం రూ.50వేలు లోపు ఉన్న ఫీజులను 20శాతం పెంచేందుకు ఏఎఫ్‌ఆర్‌సీ అంగీకారం తెలిపింది. అలాగే, 50వేలకు మించి ఉన్న ఫీజులను 15శాతం పెంచేందుకు ప్రతిపాదించింది. నెల రోజుల్లో పూర్తిస్థాయి ఫీజులను ఖరారు చేస్తామని స్పష్టంచేసింది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు సహకరించాలని కళాశాల యాజమాన్యాలను కోరింది. దీంతో మధ్యంతర పెంపు ప్రతిపాదనను ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు అంగీకరించాయని ఉన్నత విద్యామండలి తెలిపింది. దీంతో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియకు లైన్‌ క్లియర్‌ అయింది. జులై 1 నుంచి 4వరకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టనున్నారు. ఇప్పటికే ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది.