అర్ధరాత్రి కుంభవృష్టి.. వాన నీటిలో నగరం

అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్‌ అతలాకుతలం అయ్యింది. నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వాన కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే గురువారం ఉదయం నుంచి వర్షం జాడ లేకపోవడంతో నగరజీవికి ఉపశమనం కలిగింది. అంతలోనే నగరం నిద్రపోతున్నవేళ ఒక్కసారిగ కుంభవృష్టిగా వర్షం కురవడంతో పలు లోతట్టుప్రాంతాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది. గత రాత్రి 11. 30 నుంచి ప్రారంభమైన అర్ధరాత్రి ఒంటిగంట వరకు […]

అర్ధరాత్రి కుంభవృష్టి.. వాన నీటిలో నగరం

Edited By:

Updated on: Sep 27, 2019 | 4:06 AM

అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్‌ అతలాకుతలం అయ్యింది. నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వాన కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే గురువారం ఉదయం నుంచి వర్షం జాడ లేకపోవడంతో నగరజీవికి ఉపశమనం కలిగింది. అంతలోనే నగరం నిద్రపోతున్నవేళ ఒక్కసారిగ కుంభవృష్టిగా వర్షం కురవడంతో పలు లోతట్టుప్రాంతాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది. గత రాత్రి 11. 30 నుంచి ప్రారంభమైన అర్ధరాత్రి ఒంటిగంట వరకు కురిసింది. దీంతో మెహదీపట్నం, నాంపల్లి,బేగంబజార్, ఖైరతాబాద్, మోండా మార్కెట్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వర్షానికి నగరంలో దాదాపు 100 బస్తీలు ముంపులో చిక్కుకున్నట్టు అంచానావ వేస్తున్నారు. నగరంలో ప్రధాన కూడలిగా ఉన్న పంజాగుట్ట వద్ద వర్షపునీరు రహదారులను ముంచెత్తింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ఏర్పడింది. అలేగే మెహదీపట్నం, రాజేంద్రనగర్ మార్గంలో కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం అర్ధరాత్రి ఏకధాటిగా కురిసిన వర్షపాతం చూస్తే అత్యధికంగా గుడిమల్కాపూర్ ప్రాంతంలో 14.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.