జగన్ చుట్టూ పెద్ద కుట్ర జరుగుతున్నట్లుంది: హీరో రామ్

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి హీరో రామ్ పలు సంచలన ట్వీట్లు చేశాడు. '' పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది!! సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి!'' అంటూ సంచలన ట్వీట్ చేశాడు.

జగన్ చుట్టూ పెద్ద కుట్ర జరుగుతున్నట్లుంది: హీరో రామ్

Updated on: Aug 15, 2020 | 2:47 PM

Hero Ram Sensational Tweets: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి హీరో రామ్ పలు సంచలన ట్వీట్లు చేశాడు. ” పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది!! సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి!” అంటూ సంచలన ట్వీట్ చేశాడు. కొంతమంది ఆయనకు తెలియకుండా చేస్తున్న పనుల వల్ల జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని.. వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నానంటూ రామ్ పేర్కొన్నాడు. అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారని వివరించాడు. కాగా, స్వర్ణ ప్యాలెస్‌ను రమేష్ హాస్పిటల్ కంటే ముందు ప్రభుత్వమే కోవిడ్ సెంటర్‌ను నిర్వహించిందని పేర్కొన్నాడు.