మోహన్ బాబు తనయుడిగా మంచు విష్ణు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. పరాజయాలు ఎదురైనా.. సినిమాలు చేస్తూనే వచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు టాలీవుడ్‌లో తన మార్కెట్ నిలబెట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు విష్ణు. కాగా ప్రస్తుతం ‘భక్త కన్నప్ప’ చిత్రంతో ముందుకు రాబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విష్ణు.. భక్త కన్నప్ప చిత్రం గురించే కాకుండా.. అటు రాజకీయంగా కూడా హాట్ కామెంట్స్ చేశారు. జగన్ అన్నే నాకు ముఖ్యమంటూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ముందుగా ‘భక్త కన్నప్ప’ లాంటి చిత్రంలో నటించడం నాకు బాగా నచ్చింది. భక్త కన్నప్ప చిత్రాన్ని మొదట నటులు తనికెళ్ల భరణి అంకుల్ దర్శకత్వంలో తెరకెక్కించాలని అనుకున్నాం. అందుకు కథ కూడా రెడీ చేయించాను. ప్రీ పొడక్సన్‌లో బడ్జెట్ అంచానా వేస్తే.. ఏకంగా 95 కోట్ల వరకూ లెక్క వచ్చింది. అయితే బడ్జెట్ గురించి తెలిశాక.. భరణి అంకుల్ హ్యాండిల్ చేయలేనన్నారు. ఇక అందుకే హాలీవుడ్ రైటర్‌ని తీసుకున్నాము. అందులోనూ ఈ సినిమాను హాలీవుడ్ లెవల్‌కి తీసుకెళ్లాలన్నదే నా కోరిక. అయితే అంత బడ్జెట్ ఇప్పుడు లేదు. కాబట్టి ప్రస్తుతం బడ్జెట్‌ని తగ్గించే పనిలో ఉన్నామని విష్ణు తెలిపారు.
కాగా.. వంద కోట్లతో సినిమా చేసేంత డబ్బు మీ దగ్గర లేదా అన్న ప్రశ్నకు బదులుగా.. ప్రస్తుతం నా మార్కెట్ అంత లేదు. భక్త కన్నప్ప విజయం సాధిస్తే వస్తుంది అనుకుంట. అయినా అంత డబ్బు నా దగ్గర లేదు. నేను కట్టే ఐటీ రిటర్న్స్ చూసి ఐటీ అధికారులే షాకయ్యారు. మీ రిటర్న్స్ ఇంత తక్కువగా ఉన్నాయేంటని అడిగారు.
ఇక రాజకీయంగా.. మంచు ఫ్యామిలీ స్టాండ్ గురించి విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అందరికన్నా ముందు నా భార్య విరోనికా, నా ఫ్యామిలీయే ముఖ్యం. ఆ తరువాతే ఎవరైనా అని తెలిపారు ఆయన. అటు చంద్రబాబు, ఇటు జగన్ కుటుంబాలతో మాకు మంచి సంబంధాలున్నాయి. చంద్రబాబు నా అంకులే. నా భార్య విరోనికాకి జగన్.. అన్న అవుతారు. కాబట్టి జగన్ అన్నే నాకు ముఖ్యం. అలాగే బాలయ్యతో కూడా మాకు మంచి రిలేషన్ ఉందని చెప్పుకొచ్చారు విష్ణు.
ఇది కూడా చదవండి: అసలు టార్గెట్ దొరబాబు కాదట.. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే!
Read More this also: ఆయన్ని కొడితే రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ.. ఆనందంలో రోజా!
Read More: మళ్లీ ప్రేమలో పడ్డ టాలీవుడ్ విలన్! ఈయనది 51.. ఆమెది 33