విక్టరీ వెంకటేష్ యాక్టీవ్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ ఈయన ఎనర్జిటిక్‌గా ఉంటూ.. ఎదుటివారిలో ఉత్సాహం నింపుతారు. ఇక చైతూ సైలెంట్‌గా పంచ్‌లు విసురుతూంటాడు. కాగా.. వీరిద్దరూ కలిసి కాంబోగా రచ్చ చేసిన సినిమా ‘వెంకీ మామ’. 13వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇందులో మామగా వెంకీ అలరించగా.. చైతూ ఎంటర్‌టైన్ చేశాడు. వీరిద్దరి సరసన పాయల్, రాశీ ఖన్నా జోడీగా నటించారు. కాగా.. ఈ సినిమాకి కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహించగా డి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. అయితే.. ఈ చిత్రం చూసిన ప్రిన్స్ మహేష్ బాబు ట్వీట్ చేశాడు.
‘వెంకీ మామ సినిమా ఫుల్ ఫన్నీ ఎంటర్‌టైనర్‌గా ఉంది. ఈ సినిమాలో ప్రతీ బిట్‌ని నేను, నా ఫ్యామిలీ ఫుల్‌గా ఎంజాయ్ చేశాం. వెంకటేష్ గారు, చైతూల మధ్య కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్‌కి ఓ వెలుగులా ఉంది. ఇందులో సెంటిమెంట్‌కి, ఎమోషన్స్‌కి, కామెడీకి ముఖ్యంగా ఫ్యామిలీకి ఇచ్చిన వ్యాల్యూస్ సూపర్‌గా ఉన్నాయి. ఈ మొత్తం చిత్ర బృందానికి కంగ్రాట్యులేషన్స్’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు హీరో మహేష్ బాబు.
#VenkyMama is a thorough entertainer. Really enjoyed every bit of it. #Venkatesh garu and @chay_akkineni light up the screen with their Mama-Alludu chemistry ? A perfect blend of emotions, comedy and family values. Congratulations to the entire team ??
— Mahesh Babu (@urstrulyMahesh) December 17, 2019