Dadasaheb Phalke award winners : సౌత్ ఉత్తమ చిత్రంగా ‘జెర్సీ’..బెస్ట్ యాక్టర్‌గా నిలిచిన నవీన్ పోలిశెట్టి

యువ నటుడు నవీన్ పోలిశెట్టి 2019 లో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అతడి అద్భతమైన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.

Dadasaheb Phalke award winners : సౌత్ ఉత్తమ చిత్రంగా జెర్సీ..బెస్ట్ యాక్టర్‌గా నిలిచిన నవీన్ పోలిశెట్టి

Updated on: Jan 01, 2021 | 6:27 PM

యువ నటుడు నవీన్ పోలిశెట్టి 2019 లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అతడి అద్భతమైన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. తాజాగా 2020 సౌత్ కేటగిరీలో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును నవీన్ దక్కించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన నాని ‘జెర్సీ’ మూవీ 2020  ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

డియర్ కామ్రేడ్’లో అద్భుతమైన నటన ప్రదర్శించిన రష్మిక మందన్న ఉత్తమ నటి అవార్డును దక్కించుకుంది. ప్రభాస్ బిగ్-బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’కు దర్శకత్వం వహించిన యువ దర్శకుడు సుజీత్ ఉత్తమ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు.  ‘అల వైకుంఠపురంలో’ వంటి మ్యూజికల్ హిట్‌తో శ్రోతలను ఆకట్టుకున్న ఎస్ఎస్ తమన్ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ కింగ్  అక్కినేని నాగార్జునకు ఈ ఏడాది మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు దక్కింది. 

Also Read : 

Coronavirus Alert : సూర్యాపేటలో కరోనా కన్నెర్ర..ఒక కుటుంబంలో ఏకంగా 22 మందికి వైరస్ పాజిటివ్

Nara Lokesh Challenge : సీఎం జగన్‌కు నారా లోకేశ్ సవాల్..’సింహాద్రి అప్పన్న’ సాక్షిగా తేల్చుకుందాం అంటూ ట్వీట్