టాలీవుడ్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. అందుకే టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు ప్రభాస్‌తో సినిమా చేయడానికి క్యూ కడతారు. అయితే తాజాగా ఓ స్టార్ డైరెక్టర్‌కు ప్రభాస్ షాక్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రభాస్‌తో ఓ సినిమా చేయనున్నాడని ఈ మధ్య వార్తలు జోరందుకున్నాయి. స్పై థ్రిల్లర్ కథాంశంతో కూడిన ఈ స్టోరీని డార్లింగ్‌కు వినిపించాడని తెలుస్తోంది. అయితే అనుకోని విధంగా ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేశాడట. సురేందర్ రెడ్డి వినిపించిన థ్రిల్లర్ కథ నచ్చినప్పటికీ దాన్ని పాన్ ఇండియన్ లెవెల్‌లో తెరకెక్కించే ఆస్కారం లేకపోవడంతో ప్రభాస్ నో చెప్పాడని సమాచారం.
కాగా, ప్రస్తుతం ప్రభాస్ ‘జాన్’ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ జనవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో మొదలు కానుంది. రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.