కాలుష్యం ఈ మాట వింటుంటేనే భయమేస్తుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో.. వాయు కాలుష్యంతో.. ప్రజలు ఆక్సిజన్ కొనుక్కొని ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా.. వాయు కాలుష్యంపై ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో నమ్మలేని నిజాలను పేర్కొంది. ఓ వైపు పెరిగిపోతోన్న కాలుష్య నియంత్రణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అలెర్ట్ చేస్తుండగా.. మరోవైపు ఆయా ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా.. దీనికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
ఈ వాయు కాలుష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది అకాల మరణం చెందుతున్నారని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా శ్వాసకోస బాధలతో బాధపడుతున్నట్లు నివేదికలో తెలిపారు. ఈ వాయు కాలుష్యం వల్ల గుండెపోటు, డయాబెటీస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.
రెడ్‌జోన్‌లో ఉన్న ప్రాంతాలు:
ఢిల్లీ, లక్నో, బహదుర్‌ఘర్, భటిండా, భీవాండి, హాపూర్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, భివాని, హిసార్, ఫతేహబాద్, గురుగ్రామ్, బులంద్‌షహర్, అంబాలా, అమృత్ సర్, రోహతక్, పటౌడి, కాన్పూర్.
గ్రీన్‌జోన్‌లో ఉన్న ప్రాంతాలు:
హైదరాబాద్, నెల్లూరు, వైజాగ్, కాకినాడ, విజయవాడ, చెన్నై, బెంగుళూరు, మైసూర్, కొచ్చి నగరాలు.