రుతుపవనాలతో పాటు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని రోజులు వర్షాల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో అత భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 15.8 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది.
ములుగు జిల్లా మంగపేట్‌లో 14.4 సెంటీమీటర్లు, వరంగల్ రూరల్ జిల్లాలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ , ఘన్పూర్, పలిమెలలో 10 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. పెద్దపల్లి జిల్లాలో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఏపీలోని పలు ప్రాంతాలలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
Also Read : రమేష్ ఆస్పత్రికి భారీ షాకిచ్చిన ఏపీ సర్కార్