వర్షం నీటిలో భాగ్యనగరం.. రోడ్లపై మోకాల్లోతు నీళ్లు

| Edited By: Pardhasaradhi Peri

Sep 17, 2020 | 6:14 AM

హైదరాబాద్ నగరాన్ని వర్షం నీరు ముంచెత్తింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులతోపాటు గల్లీ గల్లీ వరద కాలువలుగా మారిపోయాయి. ఏకదాటిగా కొన్ని గంటల పాటు కురిసిన వర్షంతో  వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల వాహనాలు నీళ్లలో చిక్కుకుపోయాయి. మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కార్లు, ఆటోలు, లారీలు నీళ్లలో నిలిచిపోయాయి. ద్విచక్రవాహనాలైతే నీటి […]

వర్షం నీటిలో భాగ్యనగరం.. రోడ్లపై మోకాల్లోతు నీళ్లు
Follow us on

హైదరాబాద్ నగరాన్ని వర్షం నీరు ముంచెత్తింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులతోపాటు గల్లీ గల్లీ వరద కాలువలుగా మారిపోయాయి. ఏకదాటిగా కొన్ని గంటల పాటు కురిసిన వర్షంతో  వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల వాహనాలు నీళ్లలో చిక్కుకుపోయాయి. మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కార్లు, ఆటోలు, లారీలు నీళ్లలో నిలిచిపోయాయి. ద్విచక్రవాహనాలైతే నీటి ఉధృతిలో కొట్టుకుపోయాయి. కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు గంట సమయం పడుతోందని ప్రయాణికులు అంటున్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నగర వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా వర్షం దంచికొట్టింది. దాదాపు 2 గంటలపాటు ఈ కుంభవృష్టి కొనసాగింది. భాగ్యనగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కుండపోత వర్షానికి నగరంలో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. గ్రేటర్ పరిధితో పాటు శివారు ప్రాంతాలు వాన నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

దక్షిణ చత్తీస్‌ఘడ్‌ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వల్ల రాబోయే రెండు మూడు రోజుల్లో భారీవర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అటు ఏపీలో కూడా కుండపోత వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ తెలిపింది.