ముంబైలో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం..

| Edited By:

Jul 06, 2020 | 5:38 AM

కరోనాతో విలవిలలాడుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైకి భారీ వర్షాలు తోడయ్యాయి. 3 రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు మహా నగరం అతలాకుతలమవుతోంది. థానే, పాల్గర్, రాయ్‌ఘడ్ లో

ముంబైలో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం..
Follow us on

Heavy Rainfall Hits Mumbai: కోవిద్-19 తో విలవిలలాడుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైకి భారీ వర్షాలు తోడయ్యాయి. 3 రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు మహా నగరం అతలాకుతలమవుతోంది. థానే, పాల్గర్, రాయ్‌ఘడ్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ముంబై తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. రాగల 24 గంటల్లో ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. కాగా.. అటు గుజరాత్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రాగల 48 గంటల్లో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసింది. నగరంలోని పారెల్, దాదర్, కింగ్స్ సర్కిల్, సియాన్ వంటి పలు ప్రాంతాలు అడుగు నుంచి రెండడుగుల వరకూ నీటిలో చిక్కుకున్నాయి. శాంతాక్రుజ్, గొరెగావ్, మలద్, కాండివలి, బోరివలి, ఇతర పశ్చిమ ప్రాంత శివార్లలో కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి.